షో రేటింగ్ తగ్గిందని.. ఆస్కార్ అవార్డ్స్ లో సంచలన మార్పులు

ఆస్కార్ అవార్డ్స్… ఈ అవార్డ్స్ అందుకోవడం ప్రతీ నటీనటుల కల. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డ్స్ కు చాలా క్రేజ్ ఉంది. ప్రతీ ఏడాది జనవరి నెల చివర లేక ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయే ఈ కార్యక్రమానికి టీవీ రేటింగ్స్ కూడా భారీగా ఉంటాయి. కానీ క్రిందట ఏడాది అనౌన్స్ చేసిన కొన్ని అవార్డ్స్ కి అటు ఫిల్మ్ స్టార్స్ బ్రాడ్ పిట్, కెర్రీ వాషింగ్టన్, స్పైక్ లీ వంటివారి నుంచి క్రిటిక్స్ వరకు అందరూ కూడా […]

షో రేటింగ్ తగ్గిందని.. ఆస్కార్ అవార్డ్స్ లో సంచలన మార్పులు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:55 PM

ఆస్కార్ అవార్డ్స్… ఈ అవార్డ్స్ అందుకోవడం ప్రతీ నటీనటుల కల. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డ్స్ కు చాలా క్రేజ్ ఉంది. ప్రతీ ఏడాది జనవరి నెల చివర లేక ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయే ఈ కార్యక్రమానికి టీవీ రేటింగ్స్ కూడా భారీగా ఉంటాయి. కానీ క్రిందట ఏడాది అనౌన్స్ చేసిన కొన్ని అవార్డ్స్ కి అటు ఫిల్మ్ స్టార్స్ బ్రాడ్ పిట్, కెర్రీ వాషింగ్టన్, స్పైక్ లీ వంటివారి నుంచి క్రిటిక్స్ వరకు అందరూ కూడా విమర్శలు గుప్పించారు. షో రేటింగ్స్ కూడా అమాంతం తగ్గడంతో కొన్ని మార్పులు చేయాలనీ నిర్వాహకులు భావిస్తున్నారట.

వచ్చే ఆదివారం జరగబోయే 91వ ఆస్కార్ అవార్డ్స్ షో  కొన్ని మార్పులు చేర్పులతో ప్రసారమవుతుందని అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ తెలిపింది. టెక్నికల్ గా కొన్ని మార్పులు, కొన్ని అవార్డ్ కేటగిరీలు జత కలుపుతారని ఒక అధికారి తెలిపారు. గడిచిన కొన్ని నెలల్లో ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో మార్పులు జరగడం ఇది ఏకంగా నాలుగో సారి. ఇన్ని మార్పులు కూడా తగ్గిన రేటింగ్స్ ని మళ్ళీ పెంచుకోవడం కోసమే చేశారు.     

ఈ మధ్య కాలంలో షో ఎవరూ చూడకపోవడం.. ఎబిసి సంస్థతో ఉన్న ఆర్ధిక ఒత్తిడులు, ఇలా ఇంకా ఎన్నో ఇబ్బందుల వల్ల అకాడమీ పిక్చర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఏది ఏమైనా ఇప్పటికీ ఆస్కార్ అవార్డ్స్… క్రికెట్ మ్యాచ్స్ తర్వాత ఎక్కువగా చూసే టెలివిజన్ కార్యక్రమం.

Latest Articles