AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎంకు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ..ఆ నిర్ణయం సరికాదని వినతి

ఏపీ సీఎం జగన్‌కు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. రాష్ట్రంలో రెండు వరుసల రోడ్లపై టోలు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరింది.

సీఎంకు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ..ఆ నిర్ణయం సరికాదని వినతి
Ram Naramaneni
|

Updated on: Nov 20, 2020 | 5:46 PM

Share

ఏపీ సీఎం జగన్‌కు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. రాష్ట్రంలో రెండు వరుసల రోడ్లపై టోలు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు సీఎంకి లేఖ రాశారు. రెండు వరుసల రోడ్లపై టోల్ వసూల వల్ల ప్రజలు, రైతులు, రవాణా రంగంపై పెనుభారం పడుతుందని సీఎం దృష్టికి తెచ్చారు. గత రెండేళ్లుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని…ఇటీవల లాక్​డౌన్, కరోనా పరిస్థితుల వల్ల రవాణా రంగం మరింత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని లేఖలో పేర్కొన్నాారు. స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికే లీటర్ డీజిల్​పై 1.22 రూపాయల చొప్పున రోడ్ సెస్ వసూలు చేస్తోందని, ఇప్పుడు మళ్లీ రోడ్లపై టోల్ వసూలు చేస్తే భారం అధికం అవుతుందని వివరించారు.

2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ అభ్యర్థన మేరకు బ్రిడ్జిలపై టోల్ టాక్స్ రద్దు చేశారని….ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లపై టోల్ విధించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు ఆలోచన విరమించుకోవాలని లారీ యజమానుల సంఘం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.

Also Read :

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్