Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

సుడి, అదృష్టం ఉంటే చాలు ఎక్కడ ఉన్నా కలిసివస్తోంది. కొంతమంది మాత్రం ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సక్సెస్ దక్కదు.

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 19, 2020 | 3:54 PM

సుడి, అదృష్టం ఉంటే చాలు ఎక్కడ ఉన్నా కలిసివస్తోంది. కొంతమంది మాత్రం ఏళ్ల తరబడి కష్టపడుతున్నా సక్సెస్ దక్కదు. అది వాళ్ల ఫేట్ అంతే. తాజాగా ఒక వ్యక్తికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది. అయ్యో నిజమండీ బాబు…ఆకాశం నుంచి పడిన ఓ గ్రహ శకలం అతడ్ని ఓవర్‌నైట్ కోటీశ్వరుడిని చేసింది.

వివరాల్లోకి వెళ్తే… ఇండోనేషియాలోని ఉత్తర సుమాత్రా ఏరియాలో 33 ఏళ్ల జోషువా హుటాగలుంగ్ తన కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. శవపేటికలు తయారుచేయడం అతడి వృత్తి. కాగా ఇటీవల అతని ఇంటి పెరట్లో రాత్రి పూట ఓ భారీ గ్రహ శకలం పడింది. దాని బరువు 2.2 కిలోగ్రాములుగా ఉంది. అయితే అది మంచి వాల్యు ఉంటుందని అంచనా వేసిన అతడు దాన్ని భద్రపరిచాడు. మొదట టచ్ చేశాక కొద్దిగా వేడిగా అనిపించిందని… అయినప్పటికీ వెంటనే  ఇంట్లోకి తీసుకెళ్లి భద్రపరిచానని అతడు చెప్పాడు. అనంతరం అందుకు సంబంధించిన విజువల్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కాగా ఆ వార్త తెలుసుకున్న అమెరికాకు చెందిన ఉల్క నిపుణుడు జేర్డ్ కొల్లిన్స్ ఆ గ్రహ శకలానికి భారీ మొత్తంలో చెల్లించి దాన్ని జోషువా నుంచి కొనుగోలు చేశాడు. అందుకు గాను జోషువాకు ఏకంగా 1.8 మిలియన్ డాలర్లు (దాదాపుగా రూ.13.37 కోట్లు) వచ్చాయి. కాగా సదరు గ్రహశకలం సుమారుగా 450 కోట్ల సంవత్సరాల కాలం నాటిదని, CM1 / 2 కార్బోనేషియస్ కొండ్రైట్ వర్గానికి చెందిన ఉల్క అని నిపుణులు గుర్తించారు.  దానిపై వారు పరిశోధనలు చేయనున్నారు.

Also Read :

తిరుమలలో వృద్ధులకు స్లాట్లు కేటాయింపు వార్తలపై టీటీడీ క్లారిటీ

సీనియర్ హీరోయిన్ల ఫేవరెట్ యాక్టర్‌గా మారిన జూనియర్ రామారావు

రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు

ఇక పదేళ్ల పిల్లలు కూడా బ్యాంకు ఖాతా తీయవచ్చు..ఆర్బీఐ కీలక నిర్ణయం
ఇక పదేళ్ల పిల్లలు కూడా బ్యాంకు ఖాతా తీయవచ్చు..ఆర్బీఐ కీలక నిర్ణయం
తల్లిదండ్రులైన హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల.. 
తల్లిదండ్రులైన హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల.. 
దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
దేవుడు పిలుస్తున్నాడు.. నేను వెళుతున్నానంటూ చెప్పాడు.. చివరకు..
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. మీ గుండెకు శ్రీరామ రక్ష..!!
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
అయోధ్య రామాలయంలో భక్తుల ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం..
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్.. రేపట్నుంచి రీ-వెరిఫికేషన్!
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
కూల్ గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా దోసకాయని తినాల్సిందే
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ వాకింగ్‌కి వెళ్తున్నారా..? ఇలా నడిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు..