టీవి9 చేతిలో షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి స్కాం చిట్టా.. నమ్మలేని నిజాలతో షాక్!
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గ పరిధిలో పేదింటి ఆడబిడ్డలకు అందాల్సిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో భారీ స్కాం చోటుచేసుకుంది. ఈనెల 6న జరిగిన స్థానిక జ్ఞానేశ్వర్ హత్య కేసు విచారణతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన బగునూరి సుమన బాయి అనే మహిళకు ఏకంగా రెండు సార్లు కళ్యాణలక్ష్మి కింద లబ్ధి చేకూర్చారు. ఇదే కుటుంబానికి చెందిన బగునూరి శంకుతల బాయికి రెండు సార్లు లబ్ధి […]
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గ పరిధిలో పేదింటి ఆడబిడ్డలకు అందాల్సిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో భారీ స్కాం చోటుచేసుకుంది. ఈనెల 6న జరిగిన స్థానిక జ్ఞానేశ్వర్ హత్య కేసు విచారణతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన బగునూరి సుమన బాయి అనే మహిళకు ఏకంగా రెండు సార్లు కళ్యాణలక్ష్మి కింద లబ్ధి చేకూర్చారు. ఇదే కుటుంబానికి చెందిన బగునూరి శంకుతల బాయికి రెండు సార్లు లబ్ధి కలిగింది. నకిలీ పత్రాలతో ఇచ్చోడ మీ సేవ కేంద్రం నిర్వహకులు అచ్యుత్, శ్రీనివాస్ డబ్బులు డ్రా చేసినట్టు తేలింది. బోథ్ నియోజక వర్గ పరిదిలో 15 గ్రామాల్లో రెండు కోట్లకు పైగా ఇలాంటి అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చోడ, బోథ్, గుడిహత్నూర్, సిరికొండ మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో 28 మంది పేరిట పంపిణీ అయిన చెక్కుల పంపిణీలోనే రూ.31,03,596 అవినీతి జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు 273 మంది లబ్ధి దారుల సొమ్ము పక్కదారిపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది షాదీముబారక్, కళ్యాణలక్ష్మి సాయం కోసం జిల్లా కేంద్రానికి 4,747 దరఖాస్తులు రాగా, ఇందులో 2469 దరఖాస్తులు ఆమోదం పొందాయి. కళ్యాణ లక్ష్మి , షాది మజబారక్ లలో బోగస్ పేర్లను సృష్టించి, లబ్ధిదారులకు దక్కాల్సిన సొమ్మును అప్పనంగా మింగేసిన అవినీతి అధికారుల బాగోతం ఇప్పుడు బట్టబయలైంది. ఆర్డీవో ఆఫీస్‌లో విధులు నిర్వర్తించే సీనియర్ అసిస్టెంట్ నదీమ్ బోగస్ పేర్లను సృష్టించి కళ్యాణలక్ష్మి నిధుల గోల్‌మాల్‌కు తెరలేపినట్టు తేలడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది.