బయో బబుల్ వాతారణంలో టోర్నీలు… అయినా వెంటాడుతున్న కరోనా.. దక్షిణ ఆఫ్రికా ఆటగాడికి పాజిటివ్
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడే ముందు సౌత్ ఆఫ్రికా జట్టులో కరోనా వైరస్ కలకలం రేపింది. ప్రొటీస్ జట్టులోని ఒక ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడిని కేప్‌టౌన్‌లోని ప్రత్యేక ఐసోలేషన్...

Three South Africa cricketers isolated : కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమవడంతో ప్రపంచ వ్యాప్తంగా వణుకు మొదలైంది. అయితే కరోనా వ్యాప్తి కొనసాగుతున్నా… వివిధ దేశాల్లో బయో బబుల్ వాతావరణంలో టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడే ముందు సౌత్ ఆఫ్రికా జట్టులో కరోనా వైరస్ కలకలం రేపింది. ప్రొటీస్ జట్టులోని ఒక ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడిని కేప్‌టౌన్‌లోని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
అతడితోపాటు అతనితో కలిసిన మరో ఇద్దరు ఆటగాళ్లను కూడా ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక గదిలో ఉంచారు. అయితే ఈ ముగ్గురికీ ఎలాంటి వైరస్ లక్షణాలూ లేవని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించింది. వైరస్ సోకిన ఆటగాడు, అతడిని కలిసిన మరో ఇద్దరు ప్లేయర్ల పేర్లు మాత్రం సీఎస్‌ఏ బయటపెట్టలేదు.
కొవిడ్-19 ప్రోటోకాల్స్‌లో భాగంగా ముగ్గురు ఆటగాళ్లను కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారు. ఇదిలావుంటే.. దక్షిణాఫ్రికా జట్టులోని ఇతర ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు వైద్యల బృందాన్ని ఏర్పాటు చేసినట్లుగా సీఎస్ఏ ప్రతినిధులు తెలిపారు.
అయితే కరోనా లక్షణాలున్న ఆటగాళ్లను ప్రస్తుతానికి జట్టు నుంచి తప్పించలేదని తెలిపారు. అయితే మరో ఇద్దరు ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేరుస్తున్నాట్లుగా వెల్లడించారు. నవంబర్ 21 నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో కొత్తగా జట్టులోకి వచ్చినవారు పాల్గొంటారని దక్షిణాఫ్రికా బోర్దు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంగ్లండ్‌తో రాబోయే టీ20 పర్యటన కోసం కేప్‌టౌన్‌లో బయో సేఫ్ వాతావరణంలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి సుమారు 50 కొవిడ్-19 పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు సీఎస్‌ఏ తెలిపింది. ఈ నెల 21న ఇంగ్లండ్ జట్టు ఇంటర్ స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. రెండు జట్ల మధ్య మూడు టీ20, మరో మూడు వడ్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. నవంబర్ 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.