10 గ్రామాల్లో చేపల వంటకాల జాతర.. ఎలా ఉంటుందంటే?వీడియో
ఏలూరు ఏజెన్సీలో ప్రజలు ఏడాదికి ఒక్కసారి సమిష్టిగా ఊరి చెరువులో చేపల జాతర నిర్వహిస్తారు. వేసవి కాలంలో చెరువుల్లో చేపలు పట్టడం జాతరలా ఉంటుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం నీళ్ళలోకి దిగి చేపలను పట్టి వాటిని కుప్పలుగా పోస్తారు. వాళ్ల మధ్య సమానంగా జరిగే పంపకాలు అదే సమయంలో వినిపించే చలోక్తులు సరదాగా సాగే దెప్పిపోడుపులు అన్యాయం జరిగిందంటూ సాగే ఆలకాలు చిన్నా పెద్దా బాబాయి పిన్ని అత్త మామ అంటూ వినిపించే పలకరింపులు ఇదంతా మొత్తం ఒక జాతరలా కనిపిస్తుంది.
వచ్చిన చేపలు సమానంగా పంచుకొని వండుకొని తింటారు. ఆ గ్రామాల్లో ప్రతి ఇంటా చేపల వంటకాలే. ఈ ఏడాది అదే వాతావరణంలో కుక్కునూరు మండలం చిరవాళ్ళిలోని చేపలు పడతాయి. ఈ చెరువు పరిసరాల్లో దాదాపు పది గ్రామాల ప్రజలు నివసిస్తుంటారు. వర్షాకాలంలో నిండుకుండలా ఉండే చెరువులు వేసవిలో నీరు ఇంకుపోయి వెలవెలబోతూ ఉంటాయి. అదే సమయంలో గిరిజనలు అక్కడికి చేరుకొని చెరువులో దిగి చేపలు పడతారు. బొచ్చ, శీలావతి, కొరమేను, వాలుగ ఇలా చాలా రకాల చేపలు లభిస్తాయి. ఇక వాటిని పంచుకొని ఎవరి వాటా వాళ్లు చేపలను తామర ఆకుల్లో ఉంచుకొని ఇళ్లకు తీసుకు వెళతారు. ఇక మంచి గుమగుమలాడే చేపల కూర సువాసన ప్రతి ఇంటి నుంచి వస్తుంది. మొత్తానికి కుక్కునూరు పరిసర ప్రాంతాలు గత రెండు రోజులుగా సందడిగా మారాయి.
మరిన్ని వీడియోల కోసం :
కదిలే రైళ్లో ఏటీఎం.. ట్రయల్ సక్సెస్ వీడియో
మగపిల్లల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే ! వీడియో
ఇంటి పనుల కోసం రోబోను తెచ్చుకున్న ఫ్యామిలీ వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
