వీడి చెయ్యి పడితే ఎంతటి తాళమైనా తలవంచాల్సిందే! వీడియో
దొంగతనం చేయడం అంటే అంత ఈజీ కాదండి. దానికి ఎంతో అనుభవం కావాలి. అందులోను మనోళ్ళు ఈ తాళానికి ఇంటికి తాళానికి తాళం వేస్తుంటారు. ప్రస్తుత కాలంలో రకరకాల తాళాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని ఓపెన్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. అందుకే దొంగలు కూడా అంతకు మించిన ఐడియా లతో చోరీలకు పాల్పడుతుంటారు. ఇక్కడ ఓ దొంగ ఎంతటి గట్టి తాళమైనా చిటికెలో ఓపెన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ దొంగ తాళం ఓపెన్ చేసిన తీరుకి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ వీడియోలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లున్నారు. అసలు ఈ దొంగ ఇంత గట్టిగా తాళాలను ఎలా ఓపెన్ చేస్తున్నాడో తెలుసుకోవాలనుకున్న పోలీసులు అతన్ని విచారించగా ఓ ఇంటి తాళం ఓపెన్ చేసి చూపించాడు. అతను ఉపయోగించిన టెక్నిక్ కి పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఓరి ఏం ఐడియా రా బాబు అనుకున్నారు. ఇంతకీ ఆ దొంగ ఉపయోగించిన ట్రిక్ ఏంటో తెలిస్తే మీ ఇంటి తాళం పడిపోయినప్పుడు మీరు అదే ప్రయోగం చేస్తారు. ఆ దొంగ తాళం ఓపెన్ చేయడానికి ఓ సిరంజిలో పెట్రోల్ నింపి తాళం రంధ్రంలో ఇంజెక్ట్ చేశాడు. అలాగే తాళం పైన ఉండే రింగ్ లాంటి దానికి రెండు వైపులా కూడా పెట్రోల్ ఇంజెక్ట్ చేశాడు. ఇప్పుడు అగ్గిపెట్టె తీసుకొని ఆ తాళం రంధ్రంలోనిప్పి పెట్టాడు. దాంతో చిన్నపాటి మంట వచ్చింది. అలా పెట్రోల్ మొత్తం అయిపోయే దాకా మంటలు వచ్చి ఆరిపోయాయి. ఇప్పుడు ఆ తాళాన్ని పట్టుకొని జస్ట్ ఇలా లాగాడు. అంతే సింపుల్ గా తాళం ఊడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోను మూడున్నర లక్షలకు మందికి పైగా వీక్షించారు. వేలలో లైక్ చేస్తున్నారు. ఈ దొంగ ట్రిక్ మామూలుగా లేదుగా అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కదిలే రైళ్లో ఏటీఎం.. ట్రయల్ సక్సెస్ వీడియో
మగపిల్లల కోసం బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే ! వీడియో
ఇంటి పనుల కోసం రోబోను తెచ్చుకున్న ఫ్యామిలీ వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
