AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Vishal – Jwala Gutta: తల్లిదండ్రులైన హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల.. సంతోషం రెట్టింపు అయ్యిందంటూ..

భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా తల్లి అయ్యారు. మంగళవారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కొన్నాళ్ల క్రితం కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ను గుత్తా జ్వాల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు తమ 4వ వివాహ వార్షికోత్సవం.. అదే రోజున ఆడపిల్ల జన్మించడంతో తమకు రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తుందంటూ పోస్ట్ చేశారు.

Vishnu Vishal - Jwala Gutta: తల్లిదండ్రులైన హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల.. సంతోషం రెట్టింపు అయ్యిందంటూ..
Vishnu Vishal, Jwala Gutta
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2025 | 2:36 PM

Share

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమకు పండంటి ఆడపిల్ల జన్మించినట్లు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. “మాకు ఆడపిల్ల జన్మించింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు నాడు పాప పుట్టడం మా ఆనందాన్ని మరింత రెట్టింపు చేసింది. మాకు దేవుడి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి” అంటూ తమ కూతురి చేతి ఫోటోను పంచుకున్నారు. దీంతో ఈ దంపతులకు నెటిజన్స్, సినీతారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరు 22 ఏప్రిల్ 2021న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఈ దంపతులకు పాప జన్మించడం.. అది కూడా 4వ పెళ్లి రోజున జన్మించడం ఎంతో స్పెషల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విష్ణు విశాల్ నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టకముందు కొన్నాళ్లు క్రికెట్ లో ఉన్నారు. 2009లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ సినిమాతో ఇటు తెలుగువారికి దగ్గరయ్యారు. గతేడాది విడుదలైన లాల్ సలాం సినిమా ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం. ఇక భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల సైతం నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.

విష్ణు విశాల్ కు ఇదివరకే పెళ్లి జరిగింది. కోలీవుడ్ సినీ నిర్మాత రజినీ నటరాజ్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఆర్యన్ జన్మించాడు. ఆమెతో 2018లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2019లో గుత్తా జ్వాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి 2021లో పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను వివాహం చేసుకుంది. 2005లో వీరి వివాహం జరగ్గా మనస్పర్థలతో 2011లో డివోర్స్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..