AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామాలయంలో ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం.. భక్తుల రద్దీ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

దేశ విదేశాల్లో కోట్లాది మంది శ్రీరామ భక్తులు ఉన్నారు. అందుకే అయోధ్యలోని రామయ్య ఆలయాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో రామభక్తులు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రామాలయంలో గర్భ గుడిలో బాల రామయ్యని ప్రతిష్టించినప్పటి నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకోవడం ప్రారంభించారు.

Ayodhya: రామాలయంలో ప్రదక్షిణ కోసం సొరంగం నిర్మాణం.. భక్తుల రద్దీ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
Adyohdya Ram Temple
Surya Kala
|

Updated on: Apr 22, 2025 | 1:58 PM

Share

అయోధ్య శ్రీరాముని జన్మస్థలం కనుక భక్తులకు అయోధ్య నగరం గురించి ఒక నమ్మకం ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో రామాలయం నిర్మాణం మొదటి దశని పూర్తి చేసుకున్న తర్వాత గర్భ గుడిలో బాల రామయ్యని ప్రతిష్టించారు. అప్పటి నుంచి లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం బాల రామయ్య దర్శనం కోసం రావడం ప్రారంభించారు. మరోవైపు రామాలయ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. అటువంటి పరిస్థితిలో నగరంలో జనసమూహం గణనీయంగా పెరిగింది. దీనికోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి పనులు చేస్తోంది. ఈ విషయంలో అయోధ్య-గోండా రహదారిని ఆరు లైన్ల రహదారిగా మార్చడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు బాల రామయ్యని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రామ మందిరంలో సొరంగం నిర్మాణం చేపట్టారు.

రామమందిరంలో సొరంగం నిర్మాణం.. ఎందుకంటే..

సరయునది తీరంలో కొలువైన అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఎక్కడా ఇనుము ఉపయోగించకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణం ఈ ఏడాది చివరిలో పూర్తి చేయనున్నట్లు రామాలయ ట్రస్ట్ సిబ్బంది ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు రామాలయ ప్రాంగణంలో పలు ఇతర ఆలయాల్లో దేవతల విగ్రహాల ప్రతిష్టను చేయనున్నామని చెప్పింది.

మరోవైపు బాల రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీని తగ్గించేందుకు.. భక్తుల సౌకర్యార్ధం కొత్తగా సొరంగ మార్గం నిర్మాణం చేపట్టారు. ఆలయ ప్రదక్షిణ చేసే భక్తులను.. బాల రామయ్య ఆలయానికి వచ్చే భక్తుల మధ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో సొరంగ మార్గ నిర్మాణం చేపట్టారు. రామాలయానికి తూర్పు భాగంలో నేల మట్టంలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రామాలయ ప్రదక్షిణ కోసం 800 మీటర్ల పొడవైన గోడను నిర్మించే ప్రాజెక్టులో సొరంగం ఓ భాగమని తెలుస్తుంది. దాదాపు 15 అడుగుల దిగువన 80 మీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గం ద్వారా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు భక్తులు ప్రదక్షిణలు చేయవచ్చు. దేశంలో ఆలయ ప్రదక్షిణ కోసం నిర్మించిన అతి పెద్ద సొరంగం ఇదేనని రామాలయ ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు.

అక్టోబరు నాటికి సొరంగం పనులు పూర్తి అయ్యి భక్తులకు అందుబాటులోకి రానున్నదని చెప్పారు. ఈ సొరంగ మార్గం ఆలయ సింహద్వారంలోకి భక్తులు ప్రవేశించిన వెంటనే తూర్పు వైపున ప్రధాన ద్వారం ఉంటుంది. ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్ళితే నేరుగా రామా ఆలయంలోకి వెళ్లొచ్చు. ఈ సొరంగ మార్గం పక్కనే బయటకు వెళ్లే దారి కూడా ఉంటుంది. ఈ ద్వారంలో వెళితే సొరంగ మార్గం ద్వారా భక్తులు బయటకు వెళతారు. ఈ సొరంగాన్ని రామాలయ ప్రవేశ మార్గం కిందనే నిర్మించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..