AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LG QNED TV: మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీతో క్యూఎన్‌ఈడీ టీవీలు.. త్వరలో రిలీజ్ చేయనున్న ఎల్‌జీ కంపెనీ..

LG QNED TV: ప్రముఖ గృహోప‌ర‌క‌ణాల త‌యారీ సంస్థ ఎల్జీ అత్యాధునిక క్యూఎన్‌ఈడీ టెక్నాల‌జీతో స‌రికొత్త స్మార్ట్ టీవీల‌ను ప్రవేశపెట్టనుంది.

LG QNED TV: మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీతో క్యూఎన్‌ఈడీ టీవీలు.. త్వరలో రిలీజ్ చేయనున్న ఎల్‌జీ కంపెనీ..
uppula Raju
|

Updated on: Dec 31, 2020 | 12:09 PM

Share

LG QNED TV: ప్రముఖ గృహోప‌ర‌క‌ణాల త‌యారీ సంస్థ ఎల్జీ అత్యాధునిక క్యూఎన్‌ఈడీ టెక్నాల‌జీతో స‌రికొత్త స్మార్ట్ టీవీల‌ను ప్రవేశపెట్టనుంది. త్వరలో జరగనున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ కొత్త తరం టెలివిజన్లను ప్రదర్శిస్తామని ఎల్జీ సంస్థ ప్రకటించింది. ఈ టీవీల‌ను ఎన్ఈడీ అని పిలుస్తారు. ఇందులో మినీ ఎల్ఈడి టెక్నాలజీని ఉప‌యోగించారు. ఇది టీవీ పరిశ్రమలో స‌రొకొత్త ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు. యాపిల్ సంస్థ వచ్చే ఏడాది ఐప్యాడ్ మరియు మాక్బుక్ మోడళ్లలో దీనిని ఉపయోగించబోతోంది.

మినీ ఎల్‌ఈడీ కొత్త టెక్నాలజీ ప్రకారం.. ఇందులో చిన్న ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగిస్తారు. ఇది మంచి బ్రైట్‌నెస్ కంట్రోల్‌కు స‌పోర్ట్ ఇస్తుంది. సంప్రదాయ ఎల్‌ఈడీ టెక్నాలజీకి భిన్నంగా చక్కని కాంట్రాస్ట్ స్థాయిలు మరియు తెరపై తక్కువ తీవ్రమైన హాలో ప్రభావాలను చూపుతుంది. ప్రస్తుతం చాలా ఎల్‌సిడి స్క్రీన్‌లు పూర్తి-శ్రేణి లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి, దీనిలో ఎల్‌ఈడీలు వాటి జోన్‌ల కంట్రోల్ చేయ‌బ‌డ‌తాయి. దీనికి విరుద్ధంగా, బ్రైట్‌నెస్‌ మరియు బ్లాక్ లెవ‌ల్ మారుతాయి. కానీ మినీ ఎల్‌ఈడీ టెక్నాలజీ కాస్త మెరుగ్గా ఉంటుంది.

ఎల్‌జి తన క్యూఎన్‌ఈడి టివి సిరీస్ పూర్తిగా 86 ఇంచుల పరిమాణంలో వస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఎల్జీతో పాటు, సోనీ మాత్రమే భారతదేశంలో ఒఎల్ఈడి టెలివిజన్లను విక్రయిస్తోంది. అయితే ఎల్జీ వచ్చే ఏడాది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో లో 10 టీవీ మోడళ్లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. తద్వారా టెలివిజన్ మార్కెట్లో క్యూఎన్‌ఈడీ అంటే ఏమిటో పూర్తి వివ‌రాలు మ‌న‌కు తెలుస్తాయి.

Follow Us
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..