నేడు ఏపీ లా ప్రవేశ పరీక్ష

ap law cet : కరోనా, లాక్‌డౌన్‌తో వాయిదా పడిన అన్ని రకాల పరీక్షలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రవేశ పరీక్షలను గత రెండు వారాలుగా నిర్వహిస్తున్నాయి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు. తాజాగా ఈ రోజు లా సెట్ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహిస్తున్నారు. లా కోర్సుల్లో ప్రవేశానికి గాను ఏపీ లాసెట్‌-2020ను గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు లాసెట్‌ […]

నేడు ఏపీ లా ప్రవేశ పరీక్ష
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 01, 2020 | 5:20 AM

ap law cet : కరోనా, లాక్‌డౌన్‌తో వాయిదా పడిన అన్ని రకాల పరీక్షలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రవేశ పరీక్షలను గత రెండు వారాలుగా నిర్వహిస్తున్నాయి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు. తాజాగా ఈ రోజు లా సెట్ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహిస్తున్నారు.

లా కోర్సుల్లో ప్రవేశానికి గాను ఏపీ లాసెట్‌-2020ను గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు లాసెట్‌ కన్వీనర్‌, శ్రీకృష్ణదేవరాయ  వర్సిటీ ప్రొఫెసర్‌ జ్యోతి విజయ్‌కుమార్‌ తెలిపారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండు సంవత్సరాల లా పీజీ కోర్సుకు సంబంధించి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు కరోనా ఆంక్షలు తప్పని సరిగా పాటించాలని పేర్కొన్నారు. మాస్క్, శానిటైజర్, వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.