ఆలయాలపై దాడులు దేశానికి నష్టం..
ఆలయాలపై జరుగుతున్న దాడులపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. ఆలయాలపై దాడులు ఎవరు చేసినా తప్పేనని అన్నారు. అలాంటి వాళ్లను చర్యలు తీసుకోవాలని స్వామి కోరారు. దేవాలయ సంపదను ఎవరు నాశనం చేసినా జాతికి, దేశానికి నష్టమేనన్నారు.

బుధవారం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయాన్ని దర్శించుకొనేందుకు వెళ్లిన చిన జీయర్ స్వామి ఇటీవలి కాలంలో ఏపీలో పలు ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పైవిధంగా స్పందించారు. ఆలయానికి విచ్చేసిన చినజీయర్‌కు ఈవో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్ మాట్లాడుతూ.. భక్తుల అవసరాల కోసం అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. బాబ్రీ మసీదు కేసు ఎప్పుడో కొట్టేయవలసి౦ది…ఇప్పుడైనా కొట్టేశారు స౦తోష౦ అని అభిప్రాయపడ్డారు.