AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2లక్షల కోట్ల పెట్టుబడులు..15లక్షల ఉద్యోగాలు.. వాహ్ తెలంగాణ!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పట్నించి ఇప్పటి దాకా ఆరున్నరేళ్ళలో రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెప్పించామని, వాటితో ఏర్పాటైన సంస్థల్లో సుమారు 15 లక్షల మందికి ఉపాధి....

2లక్షల కోట్ల పెట్టుబడులు..15లక్షల ఉద్యోగాలు.. వాహ్ తెలంగాణ!
Rajesh Sharma
|

Updated on: Sep 24, 2020 | 4:59 PM

Share

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పట్నించి ఇప్పటి దాకా ఆరున్నరేళ్ళలో రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెప్పించామని, వాటితో ఏర్పాటైన సంస్థల్లో సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పించామని ప్రకటించారు రాష్ట్ర ఐటీ, మునిసిపల్ పరిపాలనా శాఖా మంత్రి కే. తారక రామారావు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ గురువారం నాడు పార్టీ ఇంఛార్జీలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికల ప్రిపరేషన్‌పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

అక్టోబర్ 1వ తేదీ నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పంచాయతీ నుంచి శాసనసభ దాకా అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఫలాలు అందుతున్నాయని చెప్పారు.

ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు కేటీఆర్. ప్రైవేట్ రంగంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించామని మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అపూర్వమైన పాలన సంస్కరణలు చేపట్టామని, 60 ఏళ్ల ఫ్లోరైడ్ రక్కసిని ఆరు సంవత్సరాల్లో తరిమేశామని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని, కేవలం విపక్షాలే దివాళా తీశాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎజెండా దొరకని పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు.

Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే