ఐపీఎల్ కామెంట్రీ కోసం ముంబై వచ్చి, గుండెపోటుతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మృతి

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్‌గా డీన్ జోన్స్ అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 59 సంవత్సరాలు.

ఐపీఎల్ కామెంట్రీ కోసం ముంబై వచ్చి, గుండెపోటుతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మృతి
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 24, 2020 | 5:04 PM

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్‌గా డీన్ జోన్స్ అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. ప్రస్తుతం ముంబైలో ఉన్న జోన్స్‌కు గురువారం గుండెపోటు రావడంతో  మృతి చెందారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చినట్టు సమాచారం. ఐపీఎల్‌లో బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తరఫున వ్యాఖ్యానం చేసేందుకు ఆయన ఇండియాకు వచ్చారు. ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చిన జోన్స్.. ముంబైలోని ఓ సెవెన్ స్టార్ హోటల్‌లో బయో బబుల్‌లో ఉన్నారు. డీన్ జోన్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2020 కోసం స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ టీమ్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. జోన్స్ మంచి అనలిస్ట్ కూడా. తన మార్క్ కామెంటరీతో క్రికెట్ ప్రేమికులను అలరించారు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ లీగ్‌లలో ఆయన వ్యాఖ్యాతగా రాణిించారు. ఏదైనా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఆయన శైలి.

245 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన జోన్స్‌.. 19,188 పరుగులు‌ చేశారు. ఫస్ట్‌క్లాస్‌ ప్రదర్శనతో జోన్స్‌.. ఆసీస్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా సత్తా చాటారు. 1984 నుంచి 1992 మధ్య ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాకు డీన్ జోన్స్ ప్రాతినిధ్యం వహించారు. తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 46.11 సగటుతో 3,631 రన్స్ చేశారు. అందులో 11 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 44.61 సగటుతో 6,068 రన్స్‌ చేశారు.

Also Read :

గిల్-సారా : ఈ సారి డైరెక్ట్ లవ్ ఎమోజీ

మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్