పార్లమెంట్ సమావేశాల చివరి రోజు, హాజరైన మోదీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజైన గురువారం ప్రధాని మోదీ సభకు హాజరయ్యారు. మాస్క్ ధరించిన ఆయన సభలోకి అడుగుపెట్టగానే, బీజేపీ సభ్యులు 'జై శ్రీరామ్', భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజైన గురువారం ప్రధాని మోదీ సభకు హాజరయ్యారు. మాస్క్ ధరించిన ఆయన సభలోకి అడుగుపెట్టగానే, బీజేపీ సభ్యులు ‘జై శ్రీరామ్’, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. నిజానికి ఈ సమావేశాలు అక్టోబరు 1 తో ముగియవలసి ఉన్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా సభలను ఎనిమిది రోజులు ముందుగానే నిరవధిక వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా గత ఆదివారం రైతు బిల్లులపై రాజ్యసభలో పెద్ద ఎత్తున రభస జరగడం, 8 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్, పార్లమెంట్ బయట గాంధీ విగ్రహం వద్ద వారి నిరసన, అనంతరం ఉభయ సభలను ప్రతిపక్షాలు బాయ్ కాట్ చేయడం ముఖ్య ఘట్టాలుగా మారాయి. పైగా రైతు బిల్లులను ఆమోదించవద్దంటూ విపక్ష సభ్యులు ర్యాలీగా రాష్ట్రపతి భవన్ వద్దకు చేరుకోగా ..రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఒక్కరే భేటీ కావడం మరో అంశం.
మరో వైపు ప్రతిపక్షాలు లేకుండానే రాజ్యసభ రెండు రోజుల్లో 15 బిల్లులను ఆమోదించడం కూడా ఈ సెషన్ లోనే జరిగింది.