పోలీసులను వెంటాడుతున్న కరోనా రక్కసి
కరోనాపై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులను మహమ్మారి వెంటాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ర్ట వ్యాప్తంగా 10,142 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు
Uttar Pradesh Police : కరోనాపై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులను మహమ్మారి వెంటాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ర్ట వ్యాప్తంగా 10,142 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు యూపీ డీజీపీ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. వీరిలో 8,556 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరినట్లు తెలిపారు. మిగతా వారు ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలో ఉత్తరప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో వరుసగా మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నాయి. యూపీలో ఇప్పటి వరకు 3,69,686 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ నుంచి 3,02,689 మంది కోలుకున్నారు. 61,698 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,299 మంది ప్రాణాలు కోల్పోయారు.