స్కానింగ్ సెంటర్లలో విజిలెన్స్ తనిఖీలు

పలు ప్రయివేటు స్కానింగ్‌ సెంటర్లలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పేషెంట్ల నుంచి నిర్దేశించిన ఫీజు కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై....

స్కానింగ్ సెంటర్లలో విజిలెన్స్ తనిఖీలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పలు ప్రయివేటు స్కానింగ్‌ సెంటర్లలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పేషెంట్ల నుంచి నిర్దేశించిన ఫీజు కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై స్కానింగ్‌ సెంటర్లలో సోదాలు చేశారు. కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో అనుమతి లేకుండా కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఆరా తీశారు.

స్కానింగ్‌ సెంటర్లలోని కంప్యూటర్లలో డేటాను పరిశీలించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో అవకతవకలు ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని, రికార్డులను పరిశీలించి అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu