AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెటీఆర్ కు ప్రశంసల జల్లు.. ఈసారెవరంటే..?

రాష్ర్ట మంత్రి కేటీఆర్‌పై నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలో అమెరికాకి చెందిన సెమి కండక్టర్స్ కంపెనీ మైక్రాన్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ ని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం గత ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. ఈ మార్పుకి నాయకత్వం వహించిన మంత్రి కేటీఆర్ కి అభినందనలు తెలిపారు. […]

కెటీఆర్ కు ప్రశంసల జల్లు.. ఈసారెవరంటే..?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 9:49 PM

Share

రాష్ర్ట మంత్రి కేటీఆర్‌పై నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలో అమెరికాకి చెందిన సెమి కండక్టర్స్ కంపెనీ మైక్రాన్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్ ని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం గత ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. ఈ మార్పుకి నాయకత్వం వహించిన మంత్రి కేటీఆర్ కి అభినందనలు తెలిపారు. మైక్రాన్ తన డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం హైదరాబాద్ కి మించిన నగరం ఏదన్నారు. ఇక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు పరిశోధన, సేవల అభివృద్ధి, ఆవిష్కరణలను హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకున్నాయన్నారు.

అయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం పుష్కలంగా హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం 18 దేశాల నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో మైక్రాన్ సంస్థ భవిష్యత్తు అంతా భారతదేశం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. మైక్రాన్ సంస్థ సెమీకండక్టర్ రంగంలో అమెరికాలో ప్రస్తుతం ఉన్న రెండవ స్థానం నుంచి ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి వెళ్లాలంటే, భవిష్యత్ ప్రణాళికలు, వృద్ది అంతా హైదరాబాద్ నగరం నుంచే సాద్యం అవుతుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ సెమి కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఐటి పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన ఈకో సిస్టమ్ సిద్ధంగా ఉన్నదని, ఇక్కడ ఉన్న ఐఐటి, ఐఐఐటి ఉన్నత విద్యా ప్రమాణాలున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఇందుకు దోహదం చేస్తున్నయన్నారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో మంత్రి కేటీఆర్ అందించే సహకారం అద్భుతమైనదన్నారు. ఇలాంటి నాయకుడు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం పట్ల మైక్రాన్ సంస్ధను అభినందించారు.

గత ఐదు సంవత్సరాలుగా దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, 30 కోట్ల మందిని దారిద్ర్యరేఖ నుంచి పైకి తీసుకువచ్చామని, భారతదేశంలో డాటా విప్లవం వలన అనేక మార్పులు రాబోతున్నవన్నారు. అమెరికా, చైనా, యూరప్ వంటి అనేక దేశాలతో పోల్చినప్పుడు ఇక్కడి మొబైల్ డాటా అత్యంత చవకైనదన్నారు. డేటా విప్లవం వలన, డిజిటలీకరణ అనేక నూతన అవకాశాలు ఏర్పడతాయన్నారు. భారతదేశంలోని సమస్యలకి సరైన పరిష్కారాలు కనుగొనగలిగితే, విశ్వవ్యాప్తంగా విస్తరించడం అత్యంత సులువన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కార్పొరేట్ల టాక్స్ వలన దేశం పెట్టబడులకు మరింత ఆకర్షణీయంగా తయారైందన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టాప్ సెమి కండక్టర్ కంపెనీ మైక్రాన్ హైదరాబాద్ లో తమ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఉన్నాయన్నారు. ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించిన మైక్రాన్ సెమి కండక్టర్స్ మనుఫ్యాక్చరింగ్ యూనిట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం అవసరం అయన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. మైక్రాన్ తో కలిసి మరిన్ని సెమి కండక్టర్ కంపెనీలను హైదరాబాద్ కి తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.