జడేజా..వారెవ్వా.. అరుదైన రికార్డు అందుకున్న ఆల్‌రౌండర్!
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు ఓపెనర్ డీన్ ఎల్గర్‌ను అవుట్ చేసిన జడేజా టెస్టుల్లో అత్యంత వేగంగా రెండు వందల వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు 198 వికెట్లతో ఉన్న జడేజా డేన్ పీడ్త్, ఎల్గర్‌లను పెవిలియన్‌కు పంపడం ద్వారా 44వ టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. అతి తక్కువ టెస్టుల్లోనే 200 వికెట్లు పడగొట్టిన జడేజా […]
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు ఓపెనర్ డీన్ ఎల్గర్‌ను అవుట్ చేసిన జడేజా టెస్టుల్లో అత్యంత వేగంగా రెండు వందల వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు 198 వికెట్లతో ఉన్న జడేజా డేన్ పీడ్త్, ఎల్గర్‌లను పెవిలియన్‌కు పంపడం ద్వారా 44వ టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
అతి తక్కువ టెస్టుల్లోనే 200 వికెట్లు పడగొట్టిన జడేజా ఈ క్రమంలో శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ రికార్డును బద్దలుగొట్టాడు. హెరాత్ 47 టెస్టుల్లో 200 వికెట్లు పడగొట్టగా జడేజా అతడి కంటే మూడు టెస్టుల ముందే ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ (49 టెస్టులు), ప్రస్తుత బౌలర్ మిచెల్ స్టార్క్ (50 టెస్టులు), ఆ తర్వాతి స్థానంలో 51 టెస్టులతో టీమిండియా మాజీ ఆటగాడు బిషన్‌సింగ్ బేడీ, పాక్ మాజీ ఆటగాడు వాసిం అక్రమ్‌లు ఉన్నారు.
200 Test wickets for @imjadeja ??
He is the quickest amongst the left-arm bowlers to reach the mark ?? pic.twitter.com/ihilr9kkWM
— BCCI (@BCCI) October 4, 2019