AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో సీన్ రివర్స్.. లాక్ డౌన్ సడలించిన కొన్ని గంటల్లోనే..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. భారత్‌లో కరోనా కట్టడి చర్యల్లో కేరళ ముందుందని, కరోనాను కేరళ రాష్ట్రం జయించిందన్న వార్తల నేపథ్యంలోనే ఆ రాష్ట్రంపై కరోనా మళ్లీ పంజా

కేరళలో సీన్ రివర్స్.. లాక్ డౌన్ సడలించిన కొన్ని గంటల్లోనే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 4:05 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. భారత్‌లో కరోనా కట్టడి చర్యల్లో కేరళ ముందుందని, కరోనాను కేరళ రాష్ట్రం జయించిందన్న వార్తల నేపథ్యంలోనే ఆ రాష్ట్రంపై కరోనా మళ్లీ పంజా విసిరింది. మంగళవారం ఒక్కరోజే కేరళలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఒక్క కన్నూర్‌లోనే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

కాగా.. పాలక్కడ్‌లో నాలుగు, కాసర్‌గోడ్‌లో మూడు, మలప్పురం, కొల్లాంలో ఒక్కో కేసు నమోదైంది. గత కొద్ది రోజులుగా కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. దీంతో.. కేరళలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అంతా భావించారు. అయితే.. మంగళవారం ఒక్కరోజే 19 కేసులు వెలుగుచూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ మందికి ట్రావెల్ హిస్టరీ ఉందని అధికారులు తేల్చారు. పాజిటివ్ కేసులు పెరగడంపై సీఎం పినరయ్ విజయన్ స్పందించారు.

కాగా.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మార్చి 12 నుంచి ఏప్రిల్ 21 మధ్య కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ టెస్టులు చేశామని ఆయన ప్రకటించారు. హాట్‌స్పాట్‌లను గుర్తించిన ఆరోగ్య శాఖ అధికారులు ఆ ప్రాంతాలను పూర్తిగా సీల్ చేశారని, కేవలం కొన్ని మెడికల్ దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచినట్లు సీఎం తెలిపారు. కన్నూర్‌లో ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపై కనిపిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని.. దయచేసి మే 3 వరకూ ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Follow Us