AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్ తీరంలో చిక్కుకున్న వారికి రూ.2వేల సాయం

గుజరాత్ తీరంలో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర వాసులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బుధవారం జరిపిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.

గుజరాత్ తీరంలో చిక్కుకున్న వారికి రూ.2వేల సాయం
Rajesh Sharma
|

Updated on: Apr 22, 2020 | 3:55 PM

Share

గుజరాత్ తీరంలో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర వాసులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బుధవారం జరిపిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. గుజరాత్‌లో ఉన్న తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అక్కడున్న సుమారు 6వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు అందచేయాలని సీఎం నిర్దేశించారు.

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని, అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న తెలుగు వారికి రెండేసి వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం వీలైనంత త్వరగా అంద చేయాలని సూచించారు సీఎం. గుజరాత్‌లో తెలుగు మత్స్యకారుల అంశంపై సమీక్ష సమావేశంలో చర్చ జరిగింది. వారికి తగిన సదుపాయాలు, ఆహారం అందించాల్సిందిగా గుజరాత్‌ సీఎంకు ఫోన్‌ చేశానని సీఎం జగన్ తెలిపారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడామనని అధికారులు సీఎంకు వివరించారు. వసతి, భోజనం విషయంలో కొన్ని రకాల చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. గుజరాత్‌లో వుండిపోయిన తెలుగు వారి విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలిచ్చారు. వారికి తగిన వసతి, సదుపాయాలు అందేలా చూడాలంటూ సంబంధిత అధికారులకు సీఎం నిర్దేశించారు.

Follow Us
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు