కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి జిల్లాలో గిరిజన భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి విడుదల చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. రేవల్లి, గోపాల్‌పేట, పెద్దమందడి మండలాల్లో నిర్మాణానికి గాను రూ. ఒక కోటి 19 లక్షలు నిధులు మంజూరయ్యాయి. రేవల్లి మండలం పాతతండాకు రూ.14 లక్షలు, వనపర్తి సేవాలాల్ మహరాజ్ భవన్‌కు రూ.16 లక్షలు, శ్రీనివాస్ పూర్ బిజ్జన్నగడ్డ తండాకు రూ.14 లక్షలు, రాజపేట పాప్యగానితండాకు రూ.14 లక్షలు, పెద్దమందడి చీకటిచెట్టు తండాకు రూ.14 లక్షలు, చిన్నమందడి ధన్ […]

  • Venkata Narayana
  • Publish Date - 7:52 pm, Fri, 23 October 20
కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి జిల్లాలో గిరిజన భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి విడుదల చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. రేవల్లి, గోపాల్‌పేట, పెద్దమందడి మండలాల్లో నిర్మాణానికి గాను రూ. ఒక కోటి 19 లక్షలు నిధులు మంజూరయ్యాయి. రేవల్లి మండలం పాతతండాకు రూ.14 లక్షలు, వనపర్తి సేవాలాల్ మహరాజ్ భవన్‌కు రూ.16 లక్షలు, శ్రీనివాస్ పూర్ బిజ్జన్నగడ్డ తండాకు రూ.14 లక్షలు, రాజపేట పాప్యగానితండాకు రూ.14 లక్షలు, పెద్దమందడి చీకటిచెట్టు తండాకు రూ.14 లక్షలు, చిన్నమందడి ధన్ సింగ్ తండాకు రూ.14 లక్షలు, గోపాల్ పేట చెన్నూరు ముందరితండాకు రూ.5 లక్షలు, బుద్దారం పాటిగడ్డతండాకు రూ.14 లక్షలు మంజురయ్యాయి. నిధుల మంజూరుపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజనాభివృద్ధిశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని అన్ని వర్గాల అభివృద్ది టీఆర్ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.