Karthika Deepam: మోనిత మరో డెవిల్ ప్లాన్.. కార్తీక్ ని అమ్మ ఎక్కడ .. మళ్ళీ తరిమేశావా అంటూ ప్రశ్నించిన కూతుర్లు

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ కార్తీక దీపం. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ కు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ..

  • Updated On - 1:14 pm, Fri, 11 June 21
Karthika Deepam: మోనిత మరో డెవిల్ ప్లాన్.. కార్తీక్ ని అమ్మ ఎక్కడ .. మళ్ళీ తరిమేశావా అంటూ ప్రశ్నించిన కూతుర్లు
Karthika Deepam

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ కార్తీక దీపం. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ కు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అభిమానులే. సాయంత్రం 7. 30 అయితే చాలు టివిల ముందుకు చేరిపోతారు. అందుకే సీరియల్ మొదటి నుంచి ఇప్పటి వరకూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ 1063 వ ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. హైలెట్స్ ఏమిటో చూద్దాం..!

సౌందర్య, కార్తీక్, ఆదిత్య భోజనం చేస్తున్న సమయంలో శౌర్య, హిమలు వస్తారు. షాక్ తిన్న కుటుంబ సభ్యులతో మీరు ఎందుకు వచ్చారు అన్నట్లు చూస్తున్నారు.. మేము రావడం మీకు ఇష్టం లేదాఅని ప్రశ్నిస్తారు.. కనీసం పలకరింపుగా చిన్న నువ్వుకూడా నవ్వరా అని అంటుంది శౌర్య . . దీప గురించి తండ్రిని అడుగుతారు. ఆదిత్య రెండు మూడు రోజుల తర్వాత వస్తానన్నారు.. అంటే.. డ్రైవర్ కు పని ఉందంట అందుకే వచ్చామని చెబుతారు హిమ, శౌర్యలు,

అమ్మ ఏది అని ఆడుతూనే.. శౌర్య నాన్న నీ ఫోన్ దీప ఫోన్ కలవడం లేదు.. అవుట్ ఆఫ్ కవరేజ్ కు వెళ్ళారా అని అంటుంటే.. సౌందర్య స్నానం చేయమని అంటుంది. అమ్మ ఏది మీరు అందరూ భోజనం చేస్తుంటే.. తాను ఏమి చేస్తుంది అంటుంది హిమ. ఏమిటి డాడీ డల్ గా ఉన్నావు అంటుంది హిమ.. మీ మీద బెంగ పెట్టుకున్నాడు.. లక్ష యక్ష ప్రశ్నలు వేయకుండా వెళ్ళండి అంటుంది సౌందర్య.

మురళీ కృష్ణ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత భాగ్యంతో మాట్లాడుతూ.. దీప విషయంలో మనం ఏమనుకున్నా జరగడం లేదు. నేను దీపకు రాజీ పడమని చెబుదామనుకునే సమయంలో తినేసి ఇంటికి వెళ్ళు నాన్న అంది. విధిరాత ను ఎవరూ మార్చలేరు.. అంటుంది భాగ్య.. దీప ఇంటి ఓనర్ ఆ ఇంటిని దీప కోసమే కట్టించినట్లు ఉన్నాడు. ఎంతైనా మోనిత అదృష్టవంతురాలు.. ముష్టి మొహంది తన పంతం నెరవేర్చుకుంది అని భాగ్యం మోనిత ను తిడుతుంది.

మోనిత వాంతులు చేసుకుంటుంటే పనిమనిషి ప్రియమణి మోనిత ని మీరు ఎవరి పోలిక.. మీ అమ్మగారిదా నాన్నగారిదా లేక పొతే మీ మేనత్తదా అంటుంది.. నేను ఎవరి పోలిక కాను నేను స్పెషల్.. మరో నెలలు ఆగు నాలాంటి మరో ప్రాణి భూమి మీద పడుతుంది.. అంటుంది.. మరి కార్తీక్ అయ్య ఒప్పుకుంటాడా ని ప్రశ్నిస్తుంది ప్రియమణి.. చూస్తుండు ఏమి జరుగుతుందో అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది మోనిత.

దీప లక్ష్మణ్ ను చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంటే.. పక్కింటి సరోజక్క వస్తుంది. నీ గురించి తెలియక వచ్చాడు అంటుంది లక్ష్మణ్ అమాయకుడు అతని మాటలు నువ్వు పట్టించుకోకు అంటుంది. దీప లక్ష్మణ్ ఆరోగ్యం గురించి ఎలా డాక్టర్ బాబుకి ఎలా చెప్పాలి అని పలు రకాలుగా ఆలోచిస్తుంది.

శౌర్య అమ్మ ఏది అని ఆలోచిస్తుంది. మేము వస్తే అందరిలోనూ కంగారు కనిపించింది. అసలు ఏమి జరిగింది. అమ్మ ఏమైంది. హాస్పటల్ నుంచి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా.. మళ్ళీ గొడవ జరిగి ఉంటుందా.. అని ఆలోచిస్తూనే దీప రూమ్ వెదుకుతుంది. అమ్మ బ్యాగ్ కనిపించడం లేదు.. సెల్ఫ్ లో చీరలు లేవు అంటే అమ్మ ఇంట్లో లేదు. మళ్ళీ ఇంట్లోనుంచి వెళ్లిపోయిందా అని ఆలోచిస్తుంది. నిజంగా అమ్మానాన్న కలవలేదా అని తనలో తానే ఆలోచిస్తుంది. ఎక్కడ ఉన్నావు అమ్మా అంటూ ఏడుస్తూ.. మీద మీదకు వెళ్తుంది. మరోవైపు హిమ అమ్మ ఏది నాన్న అని అడుగుతుంది. ఏదైనా ఊరు వెళ్లిందా అంటుంది. అమ్మదీప తాతయ్య ఇంటికి వెళ్లిందా అని అడుగుతుంది.

ఇంతలో శౌర్య అక్కడకు వచ్చి అమ్మ లేదు బట్టలు సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ చెబుతుంది. నిజమా డాడీ .. మళ్ళీ వెళ్ళిపోయిందా చెప్పు డాడీ అంటుంది హిమ. నువ్వు చెప్పు నానమ్మ అంటూ సౌందర్యాన్ని అడుగుతారు. కార్తీక్ వైపు చూస్తున్న సౌందర్యాన్ని హిమ నువ్వే పంపించేశావా డాడీ అని ప్రశ్నిస్తుంది. మళ్ళీ అమ్మని ఏమన్నావు నాన్న ఎందుకు వెళ్ళిపోయింది నాన్న ఇప్పుడేగా ఆసుపత్రి నుంచి వచ్చింది. అన్ని పనులు చేయలేదు కదా.. అప్పుడే వంట చేయలేదు కదా నువ్వే కదా వంట చేయకూడదు అన్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది శౌర్య.
అమ్మకి బాగు అయ్యేవరకూ ఉంచి బాగవ్వగానే బయటకు పోమన్నావా నాన్నా అందుకే మమ్మల్ని ఫామ్ హౌస్ లో దించేసి వచ్చావా నాన్నా అంటుంటే.. హిమ మాట్లాడు డాడీ.. మాట్లాడక పొతే మేము అడిగినవి నిజమేనా అని భయమేస్తుంది అంటుంది హిమ..హిమ మాటలతో షాక్ అవుతాడు కార్తీక్.. అమ్మని నేను ఎక్కడికి వెళ్ళమనలేదు.. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పు డాడీ అంటూ కన్నీరు పెట్టుకుంటుంది హిమ. రేపటి ఎపిసోడ్ లో పిల్లల్ని దీప దగ్గరకు తీసుకుని వస్తాడు కార్తీక్.. తాను కూడా దీప దగ్గరే ఉంటానని చెబుతాడు.