AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పు చెల్లించలేదని.. మహిళను స్థంభానికి కట్టేసి….

ఆటవిక చర్యలకు ఇప్పుడు కర్ణాటక కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. అప్పు చెల్లించలేదని ఓ మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి చెప్పులతో దాడి చేశారు. ఈ అమానవీయ సంఘటన కర్ణాటక చామరాజనగర్‌ జిల్లాలోని కొడిగేహళ్లిలో చోటు చేసుకుంది. రాజమణి అనే మహిళ ఓ వ్యక్తి వద్ద రూ. 50 వేలు అప్పుగా తీసుకున్నది. ఆ డబ్బులు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యం కావడంతో సదరు వ్యక్తి.. రాజమణిని వేధింపులకు గురి చేశాడు. స్తంభానికి కట్టేసి ఆమెపై చెప్పులు, […]

అప్పు చెల్లించలేదని.. మహిళను స్థంభానికి కట్టేసి....
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2019 | 3:31 PM

Share

ఆటవిక చర్యలకు ఇప్పుడు కర్ణాటక కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. అప్పు చెల్లించలేదని ఓ మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసి చెప్పులతో దాడి చేశారు. ఈ అమానవీయ సంఘటన కర్ణాటక చామరాజనగర్‌ జిల్లాలోని కొడిగేహళ్లిలో చోటు చేసుకుంది. రాజమణి అనే మహిళ ఓ వ్యక్తి వద్ద రూ. 50 వేలు అప్పుగా తీసుకున్నది. ఆ డబ్బులు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యం కావడంతో సదరు వ్యక్తి.. రాజమణిని వేధింపులకు గురి చేశాడు. స్తంభానికి కట్టేసి ఆమెపై చెప్పులు, చీపుర్లతో దాడి చేయించాడు. ఈ దృశ్యాలను అక్కడున్న ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో బంధించిని వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌ అయ్యింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు పాల్పడిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.