Telangana: అడుక్కుని అయినా తినొచ్చు కదరా.. అందమైన పెళ్లాన్ని అడ్డు పెట్టుకుని ఇదేం పాడు పని..
సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్ చేస్తున్న దంపతుల బాగోతాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు బట్టబయలు చేసారు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి వలపు వల వేసి అమాయకులను టార్గెట్ చేసేవారు. ఆ తర్వాత.. నగ్న వీడియోలు బయట పెడుతామంటూ బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు దండుకున్నారు..

కరీంనగర్ రూరల్ మండలం ఆరేపల్లి గల శ్రీసాయి నివాస అపార్ట్‌మెంట్‌లో ఉండే బార్యభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దంపతులు ఇద్దరూ కలిసి వలపు వల వేసి అమాయకులని లొంగతీసికొని అందినకాడికి దోచుకోవడం.. డబ్బులు ఇవ్వకుంటే బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టారు.. అలా వచ్చిన డబ్బులలతో అపార్ట్‌మెంట్, కారు ఈఎంఐ కట్టడం చేసేవారు. వీరి మోసాలకి కరీంనగర్‌లో దాదాపుగా వందమంది వరకు మోసపోయారు. అంటే వారు ఏ విధంగా మోసాలు చేశారో అర్థమవుతోంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలు పోస్ట్ చెయ్యడం.. తనతో శారీరక సుఖం కావాలంటే నంబర్ కాల్ చేయండని.. పోస్ట్ చెయ్యడంతో ఆమెను బడా వ్యాపారులు, యువకులు సంప్రదించేవారు.. అలా ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్ కి వెళ్ళి శారీరకంగా కలిసే సమయంలో భర్త అశ్లీల వీడియోలు, ఫోటోలు తీసేవాడు. తరువాత ఆ ఫొటో, వీడియోలు చూపించి వారి వద్ద డబ్బులు గుంజుకునేవారు.
అయితే, ఇటీవల కరీంనగర్‌లోని ఓ వ్యక్తి వారి మాయలో పడి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. భర్తతో మందు తాగడం.. ఆమెతో శారీరకంగా కలవడం.. ఇలా దాదాపు 15 లక్షల వరకు వారికి ఇచ్చాడు.. అతను ఇచ్చిన దాదాపు 14 లక్షల డబ్బులతో అపార్ట్మెంట్, కారు ఈఎంఐలు కట్టేవారు. అయితే గత కొద్ది రోజులుగా అతడు వారి దగ్గరకు రావడం లేదు.. తన దగ్గర డబ్బులు లేకపోవడం.. అతను రాకపోవడంతో.. దంపతులు అతనికి ఫోన్ చేసి.. ఆరా తీయడం మొదలుపెట్టారు..
తమ దగ్గరకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించగా.. తనదగ్గర డబ్బులు లేవని తనను మర్చిపోవాలని ప్రాథేయపడ్డాడు.. అయినా.. అంతటితో ఆగకుండా.. ఫొటోలు, వీడియోలు ఉన్నాయంటూ.. అతనికి వాట్సప్ కాల్ చేసి బెరిచించడం మొదలుపెట్టారు. డబ్బులు ఇవ్వాలని లేదంటే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని, చంపుతామని బెదిరించగా లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇంకా నాలుగు లక్షలు కావాలని బెదిరించగా.. భయంతో.. తన స్నేహితులకి ఈ విషయాన్ని చెప్పాడు.. దీంతో వారిచ్చిన సలహా మేరకు.. పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకొని జైలుకి పంపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
