జగన్‌తో జానీయర్ ఎన్టీఆర్ మామ భేటి

జగన్‌తో జానీయర్ ఎన్టీఆర్ మామ భేటి

హైదరాబాద్: ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర బాబు… ఇద్దరు ఎమ్మెల్యేలు ఆమంచి, మేడా మల్లిఖార్జున చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఎందుకు కలిశారని మీడియా ఆయనను ప్రశ్నించగా.. జగన్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని నార్నె శ్రీనివాసరావు బదులిచ్చారు. వీరితో పాటు తూర్పుగోదావరి […]

Ram Naramaneni

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 7:40 PM

హైదరాబాద్: ఎలక్షన్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర బాబు… ఇద్దరు ఎమ్మెల్యేలు ఆమంచి, మేడా మల్లిఖార్జున చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఎందుకు కలిశారని మీడియా ఆయనను ప్రశ్నించగా.. జగన్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని నార్నె శ్రీనివాసరావు బదులిచ్చారు. వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేతో వైసీపీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తనకు, తన కుమారుడికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరినట్లు తెలిసింది. అయితే.. ఒక టికెట్‌ ఇచ్చేందుకు వైసీపీ అంగీకరించినట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమయితే మరో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu