కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు అరెస్ట్

శ్రీనగర్ : కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్( జేకేఎల్ఎఫ్) అధ్యక్షుడు యాసిన్ మాలిక్ ను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. యాసీన్ మాలిక్ ను మైసుమా పట్టణంలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేసి కోతిబాగ్ పోలీసుస్టేషనుకు తరలించారు. సోమవారం ఆర్టికల్ 34ఏ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా పుల్వామా ఘటన అనంతరం కశ్మీర్ వేర్పాటువాద నాయకులతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలకు కేటాయించిన భద్రతా సిబ్బందిని […]

కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు అరెస్ట్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:27 PM

శ్రీనగర్ : కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్( జేకేఎల్ఎఫ్) అధ్యక్షుడు యాసిన్ మాలిక్ ను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. యాసీన్ మాలిక్ ను మైసుమా పట్టణంలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేసి కోతిబాగ్ పోలీసుస్టేషనుకు తరలించారు. సోమవారం ఆర్టికల్ 34ఏ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా పుల్వామా ఘటన అనంతరం కశ్మీర్ వేర్పాటువాద నాయకులతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలకు కేటాయించిన భద్రతా సిబ్బందిని ఉపసంహరిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద కశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని ఉక్కు పాదంతో అణచి వేయాలని సర్కారు నిర్ణయించింది.