‘అన్నయ్య’ను కలిసిన తమ్ముడు, నాదెండ్ల: ఫొటో వైరల్..!
రాజకీయాలతో తమ్ముడు పవన్ కల్యాణ్ బిజీగా ఉండగా.. ఇటు సైరా సినిమాతో మెగాస్టార్ చిరు కూడా తీరికలేనంతగా ఉన్నారు. తాజాగా.. ఆయన చేస్తున్న సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. అక్టోబర్ 22న ఈ సినిమాను వివిధ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా.. తాజాగా.. చిరంజీవిని.. ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈ విషయాన్ని […]
రాజకీయాలతో తమ్ముడు పవన్ కల్యాణ్ బిజీగా ఉండగా.. ఇటు సైరా సినిమాతో మెగాస్టార్ చిరు కూడా తీరికలేనంతగా ఉన్నారు. తాజాగా.. ఆయన చేస్తున్న సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. అక్టోబర్ 22న ఈ సినిమాను వివిధ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
కాగా.. తాజాగా.. చిరంజీవిని.. ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందులో వీరి ముగ్గురు సెల్ఫీ తీసుకున్న ఫొటో కూడా ఉంది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్.. ‘చిరంజీవి గారంటే.. మాకు ఎంతో ఇష్టం.. ఆయన జీవితమే మాకు స్ఫూర్తి అంటూ’.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
Kalyan Garu and me had a wonderful meeting with Sye Raa ! Narasimha Reddy (Chiranjeevi Garu). Among the many topics that we discussed his life journey really enriched and inspired us. Wishing him great success and looking forward to more such interesting conversations. pic.twitter.com/UXzimILKNK
— Manohar Nadendla (@mnadendla) July 24, 2019