సెల్ఫీ నాదే.. ఏది సూపర్..? వైరల్‌గా రణ్‌వీర్ ఫొటోలు

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్ సింగ్ ఎప్పుడూ వైవిధ్యంగా ఉండేందుకు ఇష్టపడుతుంటాడు. అందుకే సినిమాల్లోనూ ఆయన డిఫరెంట్ కారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడుతుంటాడు. కాగా ప్రస్తుతం ఆయన ‘83’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇంతవరకు తాను నటించిన కొన్ని చిత్రాల్లోని ఫోజులతో సెల్ఫీలను తీసుకున్న రణ్‌వీర్.. వాటిని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఇందులో ఏ సెల్ఫీ బావుందంటూ ఫ్యాన్స్‌ను అడిగాడు ఈ హీరో. అందులో సుల్తాన్ […]

సెల్ఫీ నాదే.. ఏది సూపర్..? వైరల్‌గా రణ్‌వీర్ ఫొటోలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 24, 2019 | 2:28 PM

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్ సింగ్ ఎప్పుడూ వైవిధ్యంగా ఉండేందుకు ఇష్టపడుతుంటాడు. అందుకే సినిమాల్లోనూ ఆయన డిఫరెంట్ కారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడుతుంటాడు. కాగా ప్రస్తుతం ఆయన ‘83’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇంతవరకు తాను నటించిన కొన్ని చిత్రాల్లోని ఫోజులతో సెల్ఫీలను తీసుకున్న రణ్‌వీర్.. వాటిని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఇందులో ఏ సెల్ఫీ బావుందంటూ ఫ్యాన్స్‌ను అడిగాడు ఈ హీరో.

అందులో సుల్తాన్ అల్లాద్దీన్ ఖిల్జీ, సంగ్రామ్ భలేరావ్ సింబా, చాలీ చాప్లిన్(యాడ్ షూట్), పేశ్వా బాజీరావ్, కబీర్ మెహ్రా, గల్లీ బాయ్ మురాద్, గిడ్డీ గాబో, గుండా విక్రమ్, సెక్సీ బాయ్ రామ్, హ్యాండ్సమ్ లడ్డు సెల్ఫీలు ఉండగా.. వాటితో పాటు సినిమాల్లోకి రాకముందు తాను తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. వీటిపై స్పందిస్తున్న నెటిజన్లు.. వారికి నచ్చిన పోజ్‌ను కామెంట్ల రూపంలో చెబుతున్నారు.