ఆడబిడ్డలంటే బరువు, పరువు తూకమా..? ఎందుకు నాన్నా..!
ముంబైలోని ఘాట్కోవర్ ఏరియాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నదని కన్నతండ్రే కూతుర్ని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. నాన్న నన్ను చంపకు అని అర్థించినా ఆమెను ప్రాణాలతో విచిపెట్టలేదు. ఘట్కోవర్ ఏరియాలో రాజ్ కుమార్ కుటుంబం కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. రాజ్ కుమార్‌కు కూతురు మీనాక్షి అంటే పంచప్రాణాలు. ఆమెకు కూడా నాన్నంటే ప్రాణం. కుందనపు బొమ్మలాంటి కూతురికి పెళ్లి చేయాలని రాజ్ కుమార్ డిసైడయ్యాడు. ఎన్ని సంబంధాలు చూసినా మీనాక్షి పెళ్లి […]
ముంబైలోని ఘాట్కోవర్ ఏరియాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నదని కన్నతండ్రే కూతుర్ని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. నాన్న నన్ను చంపకు అని అర్థించినా ఆమెను ప్రాణాలతో విచిపెట్టలేదు. ఘట్కోవర్ ఏరియాలో రాజ్ కుమార్ కుటుంబం కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. రాజ్ కుమార్‌కు కూతురు మీనాక్షి అంటే పంచప్రాణాలు. ఆమెకు కూడా నాన్నంటే ప్రాణం. కుందనపు బొమ్మలాంటి కూతురికి పెళ్లి చేయాలని రాజ్ కుమార్ డిసైడయ్యాడు. ఎన్ని సంబంధాలు చూసినా మీనాక్షి పెళ్లి చూపుల సమయంలో మౌనంగా ఉండేది. రాజ్ కూమార్ మీనాక్షి మౌనాన్ని భయం అనుకున్నాడు.. కానీ ఆమె మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా రాజ్ కుమార్ పెళ్లి సంబంధాలు తెస్తూనే ఉన్నాడు.
సీన్ కట్ చేస్తే.. మీనాక్షి బ్రజేష్ అనే యువకుడిని ప్రేమించింది. వీరు ఓ గుడిలో పెళ్లి చేసుకుని వేరుగా కాపురం పెట్టారు. కూతురిని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న రాజ్ కుమార్‌కు విషయం తెలిసి రగిలిపోయాడు. కొన్ని రోజులైతే సర్దుకుపోతాయి అని భావించిన మీనాక్షి.. తాను తల్లి కాబోతున్నాననే శుభవార్తను తండ్రికి చెప్పింది. కానీ రాజ్ కుమార్ అదే అదునుగా భావించాడు. ఇంటికి రమ్మని ప్రేమగా ఆహ్వానించి పక్కాప్లాన్‌తో కత్తితో దాడి చేసి చంపేశాడు. అసలు పరువంటే ఇదేనా.. చంపేస్తే పరువు దక్కుతుందా..? కన్న బిడ్డలను చంపే నాన్నలకు చివరకు మిగిలేది నేరచరిత్ర.. గుండె నిండా బాధ తప్ప ఇంకేముంటుంది. ఇది ఓ కన్న కూతురి యదార్థ ఆత్మఘోష.