కొంపముంచిన ఫేస్‌బుక్ మెసేజ్.. జూనియర్ పై సీనియర్ల ప్రతాపం..!
ఖమ్మం జిల్లాలో కొందరు విద్యార్థులు రౌడీల్లా రెచ్చిపోతున్నారు. సీనియర్లు కదా తమని అడిగేవారు లేరంటూ కాలేజీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తప్పులేకుండా జూనియర్ల పై ప్రతాపం చూపిస్తున్నారు. సీనియర్ల దాటికి జూనియర్ విద్యార్థులు చదువుకోవాలంటే భయపడుతున్నారు. చిన్న ఇష్యూని.. సీరియస్ గా తీసుకుని ఓ జూనియర్ విద్యార్థిని విచక్షణా రహితంగా దాడి చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్.. సీనియర్ విద్యార్థుల పని తీరు ఇది. పెద్దపల్లి […]
ఖమ్మం జిల్లాలో కొందరు విద్యార్థులు రౌడీల్లా రెచ్చిపోతున్నారు. సీనియర్లు కదా తమని అడిగేవారు లేరంటూ కాలేజీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తప్పులేకుండా జూనియర్ల పై ప్రతాపం చూపిస్తున్నారు. సీనియర్ల దాటికి జూనియర్ విద్యార్థులు చదువుకోవాలంటే భయపడుతున్నారు. చిన్న ఇష్యూని.. సీరియస్ గా తీసుకుని ఓ జూనియర్ విద్యార్థిని విచక్షణా రహితంగా దాడి చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్.. సీనియర్ విద్యార్థుల పని తీరు ఇది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన శివగణేష్.. డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఫేస్ బుక్ ద్వారా తన ఫ్రెండ్ కు పంపాల్సిన మెసేజ్.. ఫైనలియర్ విద్యార్థికి పంపాడు. ఫేస్‌బుక్‌లో అసభ్యకర మెసేజ్ చూసిన అఫ్రిది తన స్నేహితులు మనితేజ, సాయి కిరణ్‌లతో కలిసి శివగణేష్ పై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు కురిపించారు. దాడి చేస్తుండగా ఆ దృశ్యాల్ని మిగతా సీనియర్ విద్యార్థులు వీడియో తీశారు. ఈ వీడియో మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన కాలేజ్ యాజమాన్యం కేసులు లేకుండా రాజీ ప్రయత్నం చేసింది. కాని, బాధితుడి ఫిర్యాదు మేరకు సీనియర్ విద్యార్థులపై పోలీసులు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు.