AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: రోహిత్ సేనకు బ్యాడ్ న్యూస్.. ఢిల్లీ మ్యాచ్‌లో గాయపడిన తుఫాన్ బ్యాటర్..

Ishan Kishan Injury: ఐపీఎల్ మెగా వేలంలో తుఫాన్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

IPL 2022: రోహిత్ సేనకు బ్యాడ్ న్యూస్.. ఢిల్లీ మ్యాచ్‌లో గాయపడిన తుఫాన్ బ్యాటర్..
Ipl 2022 Dc Vs Mi Ishan Kishan Injured Against Dc
Venkata Chari
|

Updated on: Mar 27, 2022 | 6:11 PM

Share

ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) కు IPL 2022 సీజన్ (IPL 2022) ఆరంభం బ్యాటింగ్ పరంగా అద్భుతంగా ఉంది. ఆ జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌పై 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టార్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ హాఫ్‌ సెంచరీతో రాణించి జట్టును ఈ భారీ స్కోరుకు చేర్చాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌తో ముంబై అద్భుతంగా సత్తా చాటింది. కానీ, అదే సమయంలో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టును కలవరపరిచే వార్తలు బయటకు వచ్చాయి. అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్(Ishan Kishan Injured against DC) గాయపడ్డాడు. దీని కారణంగా ఇషాన్ ఆసుపత్రి పాలయ్యాడు. వికెట్ కీపింగ్‌కు దిగలేకపోయాడు.