PBKS vs RCB Highlights, IPL 2022: స్మిత్ మెరుపు ఇన్నింగ్స్.. బెంగళూరుపై పంజాబ్ విజయం..
Punjab Kings vs Royal Challengers Bangalore Highlights in Telugu: భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది బెంగళూరు. పంజాబ్ తో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది
భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది బెంగళూరు. పంజాబ్ తో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 206 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే అందుకుంది.
బెంగళూరు ప్లేయింగ్ -XI
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, దినేష్ కార్తీక్ (WK), డేవిడ్ విల్లీ, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్
పంజాబ్ ప్లేయింగ్-XI
మయాంక్ అగర్వాల్ (c), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టన్, భానుక రాజ్‌పక్ష (wk), ఓడిన్ స్మిత్, షారుఖ్ ఖాన్, రాజంగద్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, రాహుల్ చాహర్
LIVE NEWS & UPDATES
-
భారీ స్కోరు చేసినా బెంగళూరుకు తప్పని ఓటమి..
భారీ స్కోరు చేసిన బెంగళూరుకు ఓటమి తప్పలేదు. బౌలర్లు ధారాళంగా పరుగులివ్వడంతో ఆదివారం రాత్రి జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ చేతిలో ఓటమి చవి చూసింది. 206 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. శిఖర్ ధావన్ (43), భానుక రాజపక్సా (43), మయాంక్ (34), స్మిత్ (25) పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
-
స్మిత్ సిక్సుల వర్షం.. విజయానికి చేరువలో పంజాబ్..
ఓడియన్ స్మిత్ (8 బంతుల్లో 25, 3 సిక్సులు, ఫోర్) ధాటిగా బ్యాటింగ్ చేస్తుండడంతో పంజాబ్ లక్ష్యం దిశగా సాగుతోంది. షారుఖ్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 18.2 ఓవర్లలో 198/5.
-
-
రసవత్తరంగా సాగుతోన్న మ్యాచ్.. లివింగ్ స్టోన్..
బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 206 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన మయాంక్ సేన నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. అదే సమయంలో బెంగళూరు బౌలర్లు కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నారు. ధాటిగా ఆడుతోన్న లివింగ్ స్టోన్ (10 బంతుల్లో 19) ఔట్ కావడంతో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. పంజాబ్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 44 పరుగులు అవసరం. షారుఖ్‌ఖాన్ (9), ఓడియన్ స్మిత్ (1) క్రీజులో ఉన్నారు.
-
పంజాబ్‌కు డబుల్ బ్లో.. వరుసగా రెండు వికెట్లు తీసిన సిరాజ్..
నిలకడగా సాగుతోన్న పంజాబ్‌ను మహ్మద్ సిరాజ్ దెబ్బ తీశాడు. వరుస బంతుల్లో రాజపక్సే, రాజ్‌భవాలను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 13.2 ఓవర్లలో 141/4.
-
శిఖర్ ధావన్ ఔట్.. పంజాబ్ విజయానికి ఇంకా ఎన్ని రన్స్ కావాలంటే..
ధాటిగా ఆడుతోన్న శిఖర్ ధావన్ (29 బంతుల్లో 43) ఔటయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అనుజ్ రావత్‌కు చిక్కడంతో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. దీంతో లివింగ్ స్టోన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 11.3 ఓవర్లలో 119/2. ఇంకా విజయానికి 51 బంతుల్లో 87 పరుగులు అవసరం.
-
-
ధాటిగా బ్యాటింగ్ చేస్తోన్న పంజాబ్.. వంద దాటిన స్కోరు ..
206 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగన పంజాబ్ ధాటిగా ఆడుతోంది. కెప్టెన్ మయాంక్ వెనుదిరిగినా శిఖర్ ధావన్ (27 బంతుల్లో 41), భానుక రాజపక్సా (15 బంతుల్లో 33) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 11.1 ఓవర్లలో 118/1.
-
పంజాబ్ మొదటి వికెట్ డౌన్.. పెవిలియన్ చేరిన మయాంక్..
పంజాబ్ కింగ్స్ మొదటి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతోన్న మయాంక్ అగర్వాల్ (24 బంతుల్లో 32) ను స్పి్న్నర్ హసరంగా బౌలింగ్‌లో షాబాజ్ నదీమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భానుక రాజపక్సా క్రీజులోకి అడుగుపెట్టాడు. ప్రస్తుత పంజాబ్ స్కోరు 7.4 ఓవర్లలో 73/1.
-
మయాంక్ జోరు.. యాభై పరుగులు దాటిన పంజాబ్ స్కోరు..
పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 29) ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (18) ఆచితూచి ఆడుతున్నాడు. వీరిద్దరి చలవతో పంజాబ్ స్కోరు 50 పరుగులు దాటింది. ప్రస్తుతం జట్టుస్కోరు 5.1 ఓవర్లలో 58/0. ఇంకా విజయానికి 89 బంతుల్లో 148 పరుగులు అవసరం.
-
నిలకడగా పంజాబ్ బ్యాటింగ్.. ప్రస్తుతం స్కోరెంతంటే..
206 పరుగుల లక్ష్య ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (17బంతుల్లో28), శిఖర్ ధావన్ (8 బంతుల్లో 10) సంయమనంతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 4.1 ఓవర్లలో 48/0
-
ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్..
బెంగళూరు విధించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు పంజాబ్ బరిలోకి దిగింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్, స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఆర్సీబీ వైపు డేవిడ్ విల్లీ మొదటి బంతి అందుకున్నాడు. మొదటి ఓవర్ ముగిసే సరికి పంజాబ్ స్కోరు7/0
-
డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ మెరుపులు.. పంజాబ్ ఎదుట భారీ టార్గెట్..
డుప్లెసిస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ( 57 బంతుల్లో 88), దినేశ్ కార్తిక్ (14 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. కింగ్ కోహ్లీ (29 బంతుల్లో 41) రాణించడంలో పంజాబ్ ముందు 206 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. డుప్లెసిస్, కోహ్లీలు రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించడం ఆటలో హైలెట్. ఇక పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 22/1, అర్ష్‌దీప్ సింగ్31/1 మాత్రమే ప్రభావం చూపారు. మిగతా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చారు.
-
రెండో వికెట్ డౌన్..
ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ భీకర ఫాంలో ఉన్న డుప్లిసెస్(88) వికెట్‌ను పడగొట్టింది. రెండో వికెట్ రూపంలో బెంగళూరు సారథి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 17.3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
-
సిక్సర్ల వర్షం కురిపిస్తోన్న డుప్లెసిస్..
ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ సౌతాఫ్రికా క్రికెటర్ గేరు మార్చి సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు 47 బంతులు ఆడి 66 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.
-
గేరు మార్చిన బెంగళూరు.. వంద దాటిన స్కోరు..
బెంగళూరు గేరు మార్చింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఆర్బీసీ బ్యాటర్లు గేరు మార్చి వేగంగా పరుగులు చేస్తున్నారు. కెప్టెన్ డుప్లెసిస్ (51) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కోహ్లీ (22) కూడా ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 13 ఓవర్లలో 115/1.
-
ఆచితూచి ఆడుతోన్న ఆర్సీబీ.. పది ఓవర్లకు స్కోరెంతంటే..
పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండడంతో ఆర్సీబీ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. కెప్టెన్ డుప్లెసిస్ (33 బంతుల్లో 21), కోహ్లీ ( 11 బంతుల్లో 15) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరు స్కోరు 10.4 ఓవర్లలో 75/1.
-
మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు.. క్రీజులోకి కింగ్ కోహ్లీ..
ఆర్సీబీ మొదటి వికెట్ కోల్పోయింది. 6.6 ఓవర్లలో జట్టు స్కోరు 50 పరుగుల వద్ద ఉండగా అనుజ్ రావత్ ఔటయ్యాడు. స్పిన్నర్ రాహుల్ చాహర్ అతనిని బోల్తా కొట్టించాడు. దీంతో కింగ్ కోహ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 7.3 ఓవర్లలో 53/1.
-
కట్టుదిట్టంగా పంజాబ్ బౌలింగ్.. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరెంతంటే..
పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండడంతో ఆర్సీబీ బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతోంది. కెప్టెన్ డుప్లెసిస్ (19 బంతుల్లో 10), అనుజ్ రావత్ (12 బంతుల్లో 9) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు స్కోరు 5.3 ఓవర్లకు గాను 31/0 గా ఉంది
-
బరిలోకి దిగిన డుప్లెసిస్, అనూజ్ రావత్
ఆర్బీబీ బ్యాటింగ్ ప్రారంభమైంది. కెప్టెన్ డుప్లెసిస్ తో కలిసి అనూజ్ రావత్ క్రీజులోకి వచ్చారు. ఇటు పంజాబ్ వైపు సందీప్ శర్మ మొదటి ఓవర్ తీసుకున్నాడు. తొలి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది.
-
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్..
పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసింది.
-
కొత్త కెప్టెన్లతో బరిలోకి..
కొత్త కెప్టెన్‌తో ఇరు జట్లు రంగంలోకి దిగనున్నాయి. మయాంక్ అగర్వాల్ పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో, బెంగళూరు కమాండ్ ఫాఫ్ డు ప్లెసిస్ చేతిలో ఉంది.
Published On - Mar 27,2022 6:49 PM