AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీకి షాకిచ్చిన కేకేఆర్.. 59 పరుగుల తేడాతో అద్భుత విజయం..

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాక్ ఇచ్చింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 59 పరుగుల తేడాతో ఢిల్లీపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నితీష్ రానా(81), సునీల్ నరైన్(64) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో స్టోయినిస్, రబడా, నోర్తజే రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక 195 […]

ఢిల్లీకి షాకిచ్చిన కేకేఆర్.. 59 పరుగుల తేడాతో అద్భుత విజయం..
Ravi Kiran
|

Updated on: Oct 24, 2020 | 7:43 PM

Share

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాక్ ఇచ్చింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 59 పరుగుల తేడాతో ఢిల్లీపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నితీష్ రానా(81), సునీల్ నరైన్(64) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో స్టోయినిస్, రబడా, నోర్తజే రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఇక 195 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. బ్యాట్స్‌మెన్ తడబడటంతో నిర్ణీత ఓవర్లకు 135/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుస సెంచరీలతో జోరు మీదున్న ధావన్(6) పరుగులకే వెనుదిరగగా, రహానే డకౌట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(47), పంత్(27) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి(5/12), కమిన్స్(3/17) ఢిల్లీ పతనంతో కీలక పాత్ర పోషించారు.

Follow Us