దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై !

దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై !

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించనున్నాడు. తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టడం కోసం కార్తీక్ సారథ్య బాధ్యతలు కార్తీక్ వదులుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలస్తోంది.

Ram Naramaneni

|

Oct 16, 2020 | 2:37 PM

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించనున్నాడు. తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టడం కోసం కార్తీక్ సారథ్య బాధ్యతలు కార్తీక్ వదులుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలస్తోంది. ఈ మేరకు కోల్‌కతా మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందిందట. నాయకత్వ బాధ్యతలను ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించాలని కార్తీక్ ఫ్రాంచైజీకి విన్నవించాడు.ఈ సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. నరైన్‌కు ఓపెనర్‌గా పదే పదే అవకాశాలు ఇవ్వడం,  జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు, తన బ్యాటింగ్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో.. కోల్‌కతా అభిమానులు కార్తీక్‌ను కెప్టెన్సీపై విమర్శలు గుప్పించారు. ఈ సీజన్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ కేవలం 108 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇంగ్లాండ్‌‌కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌ను టీమ్‌లో ఉంచుకొని పెద్దగా పరిణితి లేని దినేష్ కార్తీక్‌కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నించారు. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం కార్తీక్‌పైనే నమ్మకం ఉంచింది. కోల్‌కతా ఇప్పుడు మంచి విజయాలు అందుకుంటుంది. కీలకమైన ప్లేఆఫ్స్ దశకు ముందు దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

Also Read :

చీరమేను సీజన్ వచ్చేసిందోచ్..!

జగన్ సర్కార్‌ కీలక నిర్ణయం, స్కూల్‌ అటెండెన్స్‌లో కుల, మతాల ప్రస్తావనకు స్వస్తీ

వంటలక్కతో సుమక్క

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu