జగన్ సర్కార్‌ కీలక నిర్ణయం, స్కూల్‌ అటెండెన్స్‌లో కుల, మతాల ప్రస్తావనకు స్వస్తీ

ఏపీలోని సీఎం జగన్ సర్కార్ విద్యా, వైద్యం విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా విద్యార్ధుల మధ్య సామాజిక అసమానతల తొలగింపు కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

జగన్ సర్కార్‌ కీలక నిర్ణయం, స్కూల్‌ అటెండెన్స్‌లో కుల, మతాల ప్రస్తావనకు స్వస్తీ
Follow us

|

Updated on: Oct 15, 2020 | 6:40 PM

ఏపీలోని సీఎం జగన్ సర్కార్ విద్యా, వైద్యం విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా విద్యార్ధుల మధ్య సామాజిక అసమానతల తొలగింపు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వచ్చే నెల 2 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే.  కాగా ఇకపై ఏపీలోని పాఠశాల హాజరు పట్టీలో విద్యార్ధుల కులం, మతం ప్రస్తావన ఉండదు. ఇప్పటివరకు విద్యార్ధులకు రిజర్వేషన్లు, ఇతర అవసరాల కోసం నమోదు చేసిన ఈ వివరాలను ఇకపై అటెండెన్స్  బుక్ నుంచి తొలగించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు పంపింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిన వీరభద్రుడు ఆదేశించారు. అయితే స్కూలు రికార్డుల్లో మాత్రం కులం, మతం వివరాలు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే విద్యార్ధుల కులం, మతాల ఆధారాలు అందుబాటులో ఉంటాయని సమాచారం. ( ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె )

మరోవైపు పాఠశాల విద్యార్ధుల అటెండెన్స్  బుక్‌లో బాలికల పేర్లను రెడ్ ఇంక్‌తో రాసే మరో విధానానికి కూడా ప్రభుత్వం స్వస్తి పలికింది. ఒకే స్కూల్‌లో, ఒకే క్లాస్ రూమ్‌లో, ఒకే తరహాలో విద్యను అభ్యసిస్తున్న బాలికలు, బాలురను వేర్వేరుగా చూపించేలా ఉన్న ఈ విధానం కూడా తొలగించాలని పాఠాశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ఒక తరగతిలో ఉన్న అందరు విద్యార్ధుల పేర్లు ఎలాంటి కుల, మతాల ప్రస్తావన కానీ, రెడ్ ఇంక్ కానీ లేకుండా ఒకేలా ఉండనున్నాయి. ( దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే.. )

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్