IPL 2020: గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్.. చెన్నై సూపర్ విక్టరీ..

దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ చతికిలబడి

IPL 2020: గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్.. చెన్నై సూపర్ విక్టరీ..
Follow us

|

Updated on: Oct 29, 2020 | 11:26 PM

IPL 2020: దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ చతికిలబడి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి చెన్నై బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. నితీష్ రాణా(87) అర్ధ సెంచరీతో ఆ జట్టు 20 ఓవర్లలో 172/5 పరుగులు చేసింది.

ఇక ఆ తర్వాత 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి గిడిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 178/4 పరుగులు చేసి విజయం సాధించింది. జడేజా చివరి రెండు బంతుల్లో వరుస సిక్స్‌లు కొట్టి చెన్నైకు గ్రాండ్ విక్టరీని అందించాడు. అలాగే గైక్వాడ్(72) అదిరిపోయే హాఫ్ సెంచరీ చేయగా.. అంబటి రాయుడు(38) రాణించాడు.