తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడి నుంచైనా రేషన్

వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు కార్యక్రమం తెలంగాణలో శుక్రవారం ప్రారంభమైంది. ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఎవరైనా ఎక్కడినుంచైనా సరుకులు తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఈ విధానాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఎక్కడినుంచైనా ప్రజాపంపిణీ ద్వారా సరుకులు […]

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కడి నుంచైనా రేషన్
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 6:38 PM

వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు కార్యక్రమం తెలంగాణలో శుక్రవారం ప్రారంభమైంది. ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఎవరైనా ఎక్కడినుంచైనా సరుకులు తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఈ విధానాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఎక్కడినుంచైనా ప్రజాపంపిణీ ద్వారా సరుకులు తీసుకోవచ్చన్నారు. నేషనల్ పోర్టబులిటీ తెలంగాణ, ఏపీ క్లస్టర్ ద్వారా ఇరు రాష్ట్ర ప్రజలకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన ఎంతోమంది ఏపీకి చెందిన ప్రజలకు వన్ నేషన్ – వన్ రేషన్ కార్డు విధానం ఎంతో లాభం చేకూర్చుతుంది. ఈ విధానం మిగిలిన రాష్ట్రాల్లో కూడా తొందర్లోనే అమల్లోకి రానుంది. నాలుగు రాష్ట్రాల్లో ఈవిధానాన్ని శుక్రవారం ప్రారంభించారు.