విచిత్ర ప్రేమకథ.. రౌడీని పెళ్లాడిన మహిళా కానిస్టేబుల్..

సినిమాల్లో మాత్రమే మనం వింత వింత ప్రేమకథలను చూస్తూ ఉంటాం. నిజజీవితంలో కూడా అలాంటి ప్రేమకథే వెలుగులోకి వచ్చింది. రౌడీకి, మహిళా కానిస్టేబుల్‌కు కోర్టులో చిగురించిన ప్రేమ పెళ్లిపీటలెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రాహుల్ థార్సనా 2014లో మన్మోహన్ గోయల్ అనే వ్యాపారిని హత్య చేశాడు. ఈ కేసులో అదే ఏడాది మే 9వ తేదీన అరెస్టయ్యాడు. అప్పటికే రాహుల్ పై పన్నెండుకు పైగా హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. అయితే రాహుల్‌ను కోర్టులో హాజరు పరిచేందుకు […]

విచిత్ర ప్రేమకథ.. రౌడీని పెళ్లాడిన మహిళా కానిస్టేబుల్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 09, 2019 | 7:34 PM

సినిమాల్లో మాత్రమే మనం వింత వింత ప్రేమకథలను చూస్తూ ఉంటాం. నిజజీవితంలో కూడా అలాంటి ప్రేమకథే వెలుగులోకి వచ్చింది. రౌడీకి, మహిళా కానిస్టేబుల్‌కు కోర్టులో చిగురించిన ప్రేమ పెళ్లిపీటలెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రాహుల్ థార్సనా 2014లో మన్మోహన్ గోయల్ అనే వ్యాపారిని హత్య చేశాడు. ఈ కేసులో అదే ఏడాది మే 9వ తేదీన అరెస్టయ్యాడు. అప్పటికే రాహుల్ పై పన్నెండుకు పైగా హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. అయితే రాహుల్‌ను కోర్టులో హాజరు పరిచేందుకు సూర్జాపూర్ కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ పాయల్.. అతడ్ని చూసి మనుసు పారేసుకుంది. రాహుల్ కోర్టుకు వచ్చినప్పుడల్లా అతడిని కలిసేది. రాహుల్ బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా వారు తరచూ కలుసుకుంటూ ఉండేవారు. వీరి ఐదు సంవత్సరాల ప్రేమకు తెర పడింది. రాహుల్ పాయల్‌ను పెళ్లి చేసుకున్న ఫోటోలను.. అతడి స్నేహితులకు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వీరు ఎప్పుడు.. ఎక్కడ పెళ్లి చేసుకున్నారనేది తెలియదు. మొత్తానికి వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.