సాగర్ కు జలకళ
శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు పోటెత్తడంతో పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం జలకళను సంతరించుకున్నాయి. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో మంత్రి అనిల్ కుమార్ కృష్ణమ్మకు పూజలు చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. 4 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని సాగర్ కు రిలీజ్ చేశారు. […]
శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు పోటెత్తడంతో పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం జలకళను సంతరించుకున్నాయి. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో మంత్రి అనిల్ కుమార్ కృష్ణమ్మకు పూజలు చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. 4 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని సాగర్ కు రిలీజ్ చేశారు. ఈ వరద ఉధృతి కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముండటంతో సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరగనుంది. వరుసగా మూడు రోజులు సెలవులు కూడా ఉండటంతో కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు సందర్శకులు.