కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరంటే..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత.. కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరని నియమించాలనే దాని పై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత నాయకత్వ లోపంతో బాధపడుతున్న కాంగ్రెస్ పట్టపగ్గాలు చేపట్టేదెవరో రేపటి మీటింగ్‌లో తెలియనుంది. శశి థరూర్, కరణ్ సింగ్ లాంటి వారంతా కాంగ్రెస్ లీడర్‌షిప్ మీద చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ తర్వాతి కాంగ్రెస్ చీఫ్ ఎవరో ప్రకటిస్తారని.. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ తన […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:41 pm, Fri, 9 August 19
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరంటే..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత.. కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరని నియమించాలనే దాని పై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత నాయకత్వ లోపంతో బాధపడుతున్న కాంగ్రెస్ పట్టపగ్గాలు చేపట్టేదెవరో రేపటి మీటింగ్‌లో తెలియనుంది. శశి థరూర్, కరణ్ సింగ్ లాంటి వారంతా కాంగ్రెస్ లీడర్‌షిప్ మీద చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ తర్వాతి కాంగ్రెస్ చీఫ్ ఎవరో ప్రకటిస్తారని.. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. అయితే ఆగష్టు 10న ఏఐసీసీ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరగనుంది. కాగా, రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకున్న తర్వాత జరుగుతున్న తొలి పార్టీ సమావేశం ఇది. మొదట్లో రాహుల్ రాజీనామా చేసేందుకు ప్రియాంక గాంధీ ఒప్పుకోలేదు. తాను పార్టీ నడిపించడానికి సరిపోనని, కుటుంబంలోని వ్యక్తులు కాకుండా ఖచ్చితంగా బయటివ్యక్తులే పార్టీని నడిపిస్తారని రాహుల్ ఓ సందర్భంలో వెల్లడించారు.

కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో ముఖులు వాస్నిక్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీలో ఉంటూ సీనియర్ నాయకుడిగా ఉన్న ముకుల్ వాన్సిక్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని సోనియా గాంధీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 134 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌లో ఎక్కువ శాతం నెహ్రూ-గాంధీ కుటుంబ‌మే పార్టీని శాసిస్తూ వచ్చింది. ఇక రేసు జరగనున్న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో కాంగ్రెస్ ముఖ్య నేత‌లు ఏకే ఆంటోనీ, అహ్మాద్ ప‌టేల్‌, కేవీ వేణుగోపాల్ స‌మావేశంలో పాల్గోనున్నారు.