ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: మొన్న సంఝౌతా, నేడు థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్య సంబంధాలను వదులుకోడానికి సిద్దపడ్డ పాక్.. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య నడిచే సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసింది. తాజగా శుక్రవారం పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ మరో ప్రకటన చేశారు. జోథ్‌పూర్ – కరాచీ నగరాల మధ్య నడుస్తున్న థార్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే విధంగా ఆయన “ఒక రైల్వే మంత్రిగా […]

ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్:  మొన్న సంఝౌతా, నేడు థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 09, 2019 | 5:32 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్య సంబంధాలను వదులుకోడానికి సిద్దపడ్డ పాక్.. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య నడిచే సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసింది. తాజగా శుక్రవారం పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ మరో ప్రకటన చేశారు. జోథ్‌పూర్ – కరాచీ నగరాల మధ్య నడుస్తున్న థార్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే విధంగా ఆయన “ఒక రైల్వే మంత్రిగా చెబుతున్నా.. భారత్-పాకిస్తాన్ మధ్య రైళ్లు నడిచే పరిస్థితి లేదు” అంటూ రషీద్ వ్యాఖ్యానించారు.అన్నారు.

థార్ ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఒకసారి రాజస్థాన్‌లోని మునాబో స్టేషన్ నుంచి పాక్‌లో గల ఖోక్రాపూర్ స్టేషన్ వరకు ప్రయాణం సాగిస్తుంది.