AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6 pm

1 . ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఫోన్.. ఎందుకంటే..! ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. కేరళలో వరద పరిస్థితిపై మోదీకి వివరణ ఇచ్చిన రాహుల్.. వరద బాధితులను ఆదుకోవాలని, కేరళకు సహాయం చేయాలని కోరారు…Read More 2. ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: మొన్న సంఝౌతా, నేడు థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్య […]

టాప్ 10 న్యూస్ @ 6 pm
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 09, 2019 | 6:04 PM

Share

1 . ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఫోన్.. ఎందుకంటే..!

ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. కేరళలో వరద పరిస్థితిపై మోదీకి వివరణ ఇచ్చిన రాహుల్.. వరద బాధితులను ఆదుకోవాలని, కేరళకు సహాయం చేయాలని కోరారు…Read More

2. ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: మొన్న సంఝౌతా, నేడు థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్య సంబంధాలను వదులుకోడానికి సిద్దపడ్డ పాక్.. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య నడిచే సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసింది. తాజగా శుక్రవారం…Read More

3. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరంటే..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత.. కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎవరని నియమించాలనే దాని పై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత నాయకత్వ లోపంతో బాధపడుతున్న కాంగ్రెస్ పట్టపగ్గాలు చేపట్టేదెవరో రేపటి మీటింగ్‌లో తెలియనుంది…Read More

4. సానా సతీశ్‌కు కస్టడీ ఆగస్టు 23 వరకు పొడిగింపు

మొయిన్ ఖురేషీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త సానా సతీశ్‌కు ఆగస్టు 23 వరకు కస్టడీని పొడిగిస్తూ ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు తమకు సమయం కావాలని తెలపడంతో న్యాయస్థానం అంగీకరించింది..Read More

5. తెలుగు సినిమా పంట పండింది..

66వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. Read More

6. ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. బెజవాడ టూ విశాఖ..

ఏపీ ప్రజలకు కేంద్రం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడల మధ్య త్వరలోనే ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు…Read More

7. కశ్మీర్ ప్రజలకు అండగా ఉంటాం: మావోయిస్టు పార్టీ నేత జగన్

ఆర్టికల్ 370 రద్దుపై మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది…Read More

   8. వైరల్‌గా మారిన చైనీస్ దెయ్యం..!

చైనా జియంగ్సు‌లోని హాంగ్జే సరస్సు వద్ద ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. నగరవాసులను భయభ్రాంతికి గురిచేసేలా.. కదిలే విండ్ టర్బైన్లతో ఒక దెయ్యం నగరం సరస్సు పైన తిరుగుతున్నట్లు కనిపించింది…Read More

9. ‘మన్మధుడు 2’రివ్యూ  

అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మధుడు 2’. లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది…..Read More

10. శ్రీముఖికి షాక్.. ‘బిగ్ బాస్’ సీరియస్!

‘బిగ్ బాస్’ షో వారానికి ఓ ట్విస్ట్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మూడో వారం అయితే హాట్ హాట్‌గా సాగుతోంది. టాస్క్‌లు, గేమ్స్‌తో హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య ప్రతిసారి వాగ్వాదం చోటు చేసుకుంటోంది…Read More