పునర్నవి, రాహుల్ లవ్‌స్టోరీ.. ప్రపోజల్స్ వరకు వెళ్ళింది!

పునర్నవి, రాహుల్ లవ్‌స్టోరీ.. ప్రపోజల్స్ వరకు వెళ్ళింది!

తెలుగు బిగ్ బాస్ ముచ్చటగా మూడో వారం ముగింపుకు వచ్చింది. ఈ వారం ఎలిమినేషన్స్‌లో రాహుల్, బాబా భాస్కర్, వితిక షేరు, తమన్నా సింహాద్రి, పునర్నవి భూపాలం ఉన్నారు. ఇది ఇలా ఉంటే హౌస్‌లోని సభ్యుల విషయానికి వస్తే.. వరుణ్ సందేశ్, వితిక షేరు, రాహుల్, పునర్నవిలు ఓ గ్రూప్‌గా మారారని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్లినా.. ఓ బ్యాచ్‌గా ఉంటూ మాట్లాడుతున్నారు. ఇక వరుణ్, వితికలు భార్యాభర్తలు కాబట్టి వారి మధ్య రొమాన్స్ పీక్స్‌లో ఉంది. అటు […]

Ravi Kiran

|

Aug 09, 2019 | 6:20 PM

తెలుగు బిగ్ బాస్ ముచ్చటగా మూడో వారం ముగింపుకు వచ్చింది. ఈ వారం ఎలిమినేషన్స్‌లో రాహుల్, బాబా భాస్కర్, వితిక షేరు, తమన్నా సింహాద్రి, పునర్నవి భూపాలం ఉన్నారు. ఇది ఇలా ఉంటే హౌస్‌లోని సభ్యుల విషయానికి వస్తే.. వరుణ్ సందేశ్, వితిక షేరు, రాహుల్, పునర్నవిలు ఓ గ్రూప్‌గా మారారని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్లినా.. ఓ బ్యాచ్‌గా ఉంటూ మాట్లాడుతున్నారు. ఇక వరుణ్, వితికలు భార్యాభర్తలు కాబట్టి వారి మధ్య రొమాన్స్ పీక్స్‌లో ఉంది. అటు రాహుల్, పునర్నవి మధ్య ఏదో లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

గతవారం నాగార్జున.. రాహుల్ నువ్వు సేఫ్ అనడం.. ఆయన చేతిలో ఉన్న పండు.. ఈ మధ్య అతడు డేటింగ్‌లో ఉన్నాడని చెప్పడం జరిగింది. ఇక డేటింగ్ అని పేరెత్తగానే హౌస్‌లోని కంటెస్టెంట్లు రాహుల్ వైపు చూస్తూ పునర్నవి అని చెప్పి ఆటపట్టించారు. ఇక బిగ్ బాస్‌లోని కొన్ని అన్ సీన్ వీడియోస్ స్టార్ మ్యూజిక్‌లో ప్రసారం చేస్తుంటారు. అందులో నైట్ రాహుల్, పునర్నవి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక రోజు సడన్‌‌‌‌‌‌‌‌‌గా నీ దగ్గరకు ఒక రింగ్‌తో వచ్చి ప్రపోజ్ చేస్తే ఏమంటావు అంటూ రాహుల్ ప్రశ్నిస్తాడు. అందుకు పునర్నవి ‘ఫస్ట్ నేనేంటో తెలుసుకో’ అని చెబుతుంది. ఆ తర్వాత రాహుల్.. నేను జోక్‌గానే అడుగుతున్న సీరియస్‌గా తీసుకోకుండా ఒకవేళ రింగ్ ఇచ్చి ప్రపోస్ చేస్తే ఏం చేస్తావు చెప్పు అంటూ మరోసారి ప్రశ్నించాడు. దానికి పునర్నవి పో.. పోయి పని చూసుకో అంటూ సమాధానం ఇస్తానంది.

ఇలా పలు సందర్భాల్లో ఇద్దరి మధ్య సరదా సంఘటనలు జరిగాయి. పునర్నవి కాలుతో రాహుల్ ను సరదాగా తన్నడం.. అతడు కూడా ఆమె ప్రవర్తనను చాలా లైట్ తీసుకోవడం… ఇద్దరు ఎక్కువ సేపు మాట్లాడుకోవడం వంటివి చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మున్ముందు ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచేలా కనిపిస్తోందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu