కోనసీమలో కరోనా కల్లోలం.. 24 గంటలు కర్ఫ్యూ విధింపు..
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో 24 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అమలుకు
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో 24 గంటల పాటు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అమలుకు కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేపు(ఆదివారం) ఉ.6 గంటల నుండి సోమవారం ఉ.6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర వైద్యసేవలు, మెడికల్ షాపులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉందని, మిగతా అన్ని సేవలు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో గత రెండురోజుల్లోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. కర్ఫ్యూ నిబంధనలు ధిక్కరించిన వారిపై ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధి పోలీసు స్టేషన్లలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఇప్పటివరకు అక్కడ 14 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: విధులకు హాజరు కాకపోతే.. రిటైర్మెంటే గతి ..!