కరోనా ‘మాస్క్’ రాజకీయం…ఒకరొద్దంటే..మరొకరు తప్పనిసరంటారు’..
కరోనా వైరస్ కోరలు చాస్తున్న వేళ.. అమెరికాలో మాస్కుల ధారణ రాజకీయరంగు సంతరించుకుంది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తాను ప్రజలను ఆదేశించబోనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రజలకు కొంత స్వేచ్ఛ..
కరోనా వైరస్ కోరలు చాస్తున్న వేళ.. అమెరికాలో మాస్కుల ధారణ రాజకీయరంగు సంతరించుకుంది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తాను ప్రజలను ఆదేశించబోనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రజలకు కొంత స్వేచ్ఛ ఉండాలని, ‘నేషనల్ మాస్క్ మాండేట్’ ని తాను అంగీకరించబోనని ఆయన ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే.. ఈ సమస్యపై దేశంలో పెద్ద ఎత్తున రేగిన వివాదం నేపథ్యంలో….. మాస్కుల ధారణకు అనుకూలంగా వెల్లువెత్తుతున్న అభిప్రాయాలతో నేను ఏకీభవించే ప్రసక్తి లేదన్నారు. కానీ అంటువ్యాధుల నివారణా నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫోసీ మాత్రం ట్రంప్ తో తీవ్రంగా విభేదిస్తూ.. ప్రజలు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని సూచించారు..ఈ తరుణంలో ఇదెంతో ముఖ్యమని, కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు ఇవి ఆయుధాలవంటివని ఆయన అన్నారు. మేము కూడా వీటిని ధరిస్తున్నాం అని ఫోసీ చెప్పారు. అయితే ట్రంప్ ఇటీవల ఫేస్ మాస్క్ ధరించి పబ్లిక్ లో కనబడడం విశేషం .
ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా అమెరికన్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే అని కోరుతున్నారు. ఇవి తప్పనిసరి కాదన్న తమ గత ఉత్తర్వులను వారు సవరించుకున్నారు.