క్వారెంటైన్ స్టాంప్ ఇంక్‌తో ఇన్‌ఫెక్షన్!

కరోనా నియంత్రణలో భాగంగా హోం క్వారెంటైన్‌లోను, ఐసోలేషన్‌లోను వున్న వారిని గుర్తించేందుకు దేశంలోని కొన్ని ఎయిర్‌పోర్టుల్లో వేస్తున్న స్టాంపులు వికటిస్తున్నాయి.

క్వారెంటైన్ స్టాంప్ ఇంక్‌తో ఇన్‌ఫెక్షన్!
Follow us

|

Updated on: Oct 04, 2020 | 4:02 PM

Infections due to quarantine stamp ink: కరోనా నియంత్రణలో భాగంగా హోం క్వారెంటైన్‌లోను, ఐసోలేషన్‌లోను వున్న వారిని గుర్తించేందుకు దేశంలోని కొన్ని ఎయిర్‌పోర్టుల్లో వేస్తున్న స్టాంపులు వికటిస్తున్నాయి. స్టాంపింగ్ కోసం వినియోగిస్తున్న ఇంకు కారణంగా పలువురికి ఇన్‌ఫెక్షన్ అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత మధు యాష్కీ ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దృష్టికి తీసుకురావడంతో ఇన్‌ఫెక్షన్ల విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.

విదేశాల నుంచి వస్తున్న వారికి భారతీయ ఎయిర్‌పోర్టుల్లో హోం క్వారెంటైన్ లేదా హోం ఐసోలేషన్ విధిస్తూ చేతులకు స్టాంప్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఢిల్లీకి ఇటీవల చేరుకున్న కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి కూడా ఎయిర్‌పోర్టులో స్టాంప్ వేశారు. అయితే.. ఆ తర్వాత తన చేతులు ఇలా మరిపోయాయి అంటూ వాటిని ఫోటోలు తీసిన మధు యాష్కీ… ఆ ఫోటోలతో ట్వీట్ చేశారు.

హోం క్వారెంటైన్ విధించిన తనతోపాటు పలువురి చేతులకు ఇన్‌ఫెక్షన్ సోకిన విషయం తన ద‌ృష్టికి వచ్చిందంటూ మధు యాష్కీ ట్విట్టర్ వేదికగా ఫోటోలతో సహా కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ ఫూరీ నుద్దేశించి ట్వీట్ చేశారు. స్టాంప్ ఇంకులో ఏ రసాయనాలు వాడుతున్నారో చెక్ చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. మధుయాష్కి ట్వీట్‌పై స్పందించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు మధుయాష్కీని అభినందిస్తూ.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఎండీతో ఈ విషయంపై మాట్లాడినట్టు వెల్లడించారు. అయితే ఇది కెమికల్ వల్ల కాదని.. చర్మం హైపర్ సెన్సిటివిటీ కారణంగా వచ్చిన రియాక్షన్ అని పలువురు వైద్యులు ట్విట్టర్ వేదికగా మధు యాష్కీకి సూచించడం గమనార్హం.

Also read:  త్వరలో కేంద్రం మరో షాకింగ్ డెసిషన్… క్షమాభిక్షలపై చట్టం

Also read:  కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ లేఖాస్త్రం

Also read: టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి.. బాధ్యతల స్వీకారం

Also Read: స్టీల్ సిటీ దిశగా వడివడిగా మెట్రోరైల్

Also read: కేబినెట్ నుంచి వైదొలిగిన బీజేపీ నేత