త్వరలో కేంద్రం మరో షాకింగ్ డెసిషన్… క్షమాభిక్షలపై చట్టం

త్వరలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సాకింగ్ డెసిషన్ తీసుకోబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి...

త్వరలో కేంద్రం మరో షాకింగ్ డెసిషన్... క్షమాభిక్షలపై చట్టం
Follow us

|

Updated on: Oct 04, 2020 | 2:46 PM

Modi government is going to take one more sensational decision: త్వరలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సాకింగ్ డెసిషన్ తీసుకోబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు, అందుకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేర్పులు చేసేందుకు కసరత్తు మొదలైందని కిషన్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ పర్యటనలో వున్న కిషన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లోని సెక్షన్‌లను మార్చబోతుంది.. తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు క్షమాభిక్ష పేరిట ఏళ్ల తరబడి గవర్నర్, రాష్టప్ర, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.. దీనికి చెక్ పెట్టేందుకు చట్టాలను సవరించాలని కేంద్రం తలపెట్టింది..’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లోని క్షమాభిక్ష సెక్షన్ల సవరణకు ప్రస్తుతం నిఫుణుల ఆధ్వర్యంలో కసరత్తు కొనసాగుతోందని, ఈ విషయంలో న్యాయ నిఫుణుల సలహాలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి వివరించారు. నిఫుణుల సలహాల తర్వాత డ్రాఫ్టు సిద్దం చేసి, ప్రజాభిప్రాయానికి వెళతామని ఆయన తెలిపారు. మోదీ రెండో దఫా పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలలో తాజాగా వెల్లడించిన ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్ల సవరణ కూడా ఒకటి కాబోతోందని బీజేపీ వర్గాలంటున్నాయి.

Also read:  కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ లేఖాస్త్రం

Also read: టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి.. బాధ్యతల స్వీకారం

Also Read: స్టీల్ సిటీ దిశగా వడివడిగా మెట్రోరైల్