ఈ సుంకాలు తగ్గించాల్సిందే: భారత్‌కు ట్రంప్ హితవు

అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై భారత్ అత్యధికంగా సుంకాలను(టారిఫ్‌) పెంచడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం తమకు ఆమోదం కాదని.. దీనిని ఉపసంహరించుకోవాలని ఆయన ప్రధాని మోదీకి సూచించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. ‘‘భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై ఆ దేశం అత్యధిక సుంకాలను విధిస్తోంది. ఇటీవల కాలంలో ఇవి మరింత పెరిగాయి. ఇది ఎంత […]

ఈ సుంకాలు తగ్గించాల్సిందే: భారత్‌కు ట్రంప్ హితవు
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2019 | 10:33 AM

అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై భారత్ అత్యధికంగా సుంకాలను(టారిఫ్‌) పెంచడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం తమకు ఆమోదం కాదని.. దీనిని ఉపసంహరించుకోవాలని ఆయన ప్రధాని మోదీకి సూచించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసిన ట్రంప్.. ‘‘భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై ఆ దేశం అత్యధిక సుంకాలను విధిస్తోంది. ఇటీవల కాలంలో ఇవి మరింత పెరిగాయి. ఇది ఎంత మాత్రం ఆమోదం కాదు. దీనిని భారత్ ఉపసంహరించుకోవాలి. ఈ విషయంపై నేను భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తాను’’ అని ఆయన అన్నారు.

కాగా జీ20 సమావేశాల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఇక ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని ఒసాకాకు చేరుకున్నారు. ఈ ఇద్దరు శుక్రవారం భేటీ అవ్వనున్నట్ల తెలుస్తోంది. కాగా బుధవారం భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో భేటీ అయిన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య హద్దులు చెరిపివేయాలని కోరారు. భారత్- అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది మరింత దోహద పడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ నెలారంభంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 28 వస్తువులపై భారత్ కస్టమ్ సుంకాలను పెంచింది. వాణిజ్యపరమైన రాయితీలకు తాము స్వస్తి చెబుతున్నామంటూ ట్రంప్ జూన్ 1న ప్రకటించడంతో.. ఇందుకు ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వస్తువుల్లో ఆల్మండ్స్, ఆపిల్స్, పల్సెస్, వాల్‌నట్స్ వంటివి ఉన్నాయి. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ట్రంప్‌తో సమావేశం కావడం ఇదే మొదటిసారి.

Latest Articles
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో
మహిళా ఆటో డ్రైవర్ల బ్యాంకు రుణాలు తీర్చేసిన రాఘవ లారెన్స్..వీడియో