బన్నీ మూవీ అదిరిపోయేలా.. మ్యూజిక్ రెడీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంకా సినిమా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమాకి తమన్ ఇప్పటికే ట్యూన్స్ ఇచ్చేశాడట. బన్నీ డాన్స్ మూమెంట్స్‌కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కి మంచి కిక్ ఇచ్చేలా టైటిల్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్-తమన్ కలిశారు. ఆ సినిమాలో తమన్ వర్క్ త్రివిక్రమ్‌కు బాగా నచ్చిందట. అందుకే […]

  • Publish Date - 10:34 am, Thu, 27 June 19 Edited By:
బన్నీ మూవీ అదిరిపోయేలా.. మ్యూజిక్ రెడీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంకా సినిమా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమాకి తమన్ ఇప్పటికే ట్యూన్స్ ఇచ్చేశాడట. బన్నీ డాన్స్ మూమెంట్స్‌కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కి మంచి కిక్ ఇచ్చేలా టైటిల్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది.

అరవింద సమేత సినిమాతో త్రివిక్రమ్-తమన్ కలిశారు. ఆ సినిమాలో తమన్ వర్క్ త్రివిక్రమ్‌కు బాగా నచ్చిందట. అందుకే బన్నీ సినిమా కోసం కూడా అతడినే తీసుకున్నారని సమాచారం. ఇకపోతే బన్నీకి కూడా తమన్ మ్యూజిక్ కొత్తేమి కాదు. ఇక ఆ మధ్య తమన్ ఇచ్చిన మొదటి ట్యూన్‌లో సౌండింగ్ కూడా చాలా కొత్తగా ఉందని.. త్రివిక్రమే చెప్పారట. మొత్తానికి ఈ సినిమా ఆల్బమ్ తమన్ కెరీర్ లోనే మరో సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచిపోవటం ఖాయం అనిపిస్తోంది. కాగా బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్‌తో అరవింద సమేతకి, అలాగే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్‌తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.